Begin typing your search above and press return to search.
యూఎస్ వడ్డీ పెంపు క్రూడ్ ను దెబ్బేసింది
By: Tupaki Desk | 17 Dec 2015 6:05 AM GMTఅగ్ర రాజ్యం.. అగ్రరాజ్యమే. పెద్దన్న తీసుకునే ఏ నిర్ణయమైనా.. ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుందన్న విషయం మరోసారి రుజువైంది. దాదాపు తొమ్మిది సంవత్సరాల తర్వాత అమెరికా తీసుకున్న నిర్ణయం తాలూకు ఎఫెక్ట్ షురూ అయ్యింది. 2006 తర్వాత వడ్డీ రేట్లు పెంచుతూ అమెరికా ఫెడరల్ తీసుకున్న నిర్ణయం క్రూడ్ ఆయిల్ మీద దెబ్బేసింది. ఇప్పటికే.. విపరీతంగా పడిపోయిన చమురు ధరలు.. అమెరికా వడ్డీరేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకోవటం ముడి చమురు ధరల మీద ప్రభావం చూపించాయి.
బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ప్రస్తుతం ఉన్న బ్యారల్ ధరకు 1.26 డాలర్లు తగ్గి 37.19 డాలర్లకు తగ్గింది. ఇక.. స్వీట్ క్రూడాయిల్ ధర సైతం క్రితం ముగింపుతో పోలిస్తే.. బ్యారల్ కు 1.83డాలర్లు తగ్గి 35.52 డాలర్లకు పడిపోయింది . గడిచిన ఏడాది కాలంలో క్రూడ్ ఆయిల్ ధరలు పడిపోవటం తెలిసిందే. షెల్ చమురును అమెరికా కనుగొన్నట్లు వార్తలు వచ్చిన నాటి నుంచి క్రూడాయిల్ ధరలు పడిపోవటం మొదలైంది. మొత్తంగా ఏడాది వ్యవధిలో దాదాపు 30 శాతానికి పైనే క్రూడ్ ఆయిల్ ధరలు పడిపోయాయి. రానున్న రోజులు సైతం క్రూడ్ ఆయిల్ ధరలకు ఏమంత సానుకూలంగా లేదన్న మాట వినిపిస్తోంది.