Begin typing your search above and press return to search.

జగన్ సర్కార్ ఊరట.. ఏకగ్రీవాలకు నిమ్మగడ్డ గ్రీన్ సిగ్నల్

By:  Tupaki Desk   |   8 Feb 2021 4:52 PM GMT
జగన్ సర్కార్ ఊరట.. ఏకగ్రీవాలకు నిమ్మగడ్డ గ్రీన్ సిగ్నల్
X
రేపే తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ వేళ ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఎన్నికలకు వెళుతున్న వేళ హోల్డ్ లో పెట్టిన పంచాయతీ ఏకగ్రీవాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో అక్కడ ఎన్నికలను తప్పించారు. నిమ్మగడ్డ తీసుకున్న నిర్ణయంతో ఏపీ ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది.

రాష్ట్రవ్యాప్తంగా తొలివిడతలో 525 మంది సర్పంచ్ లు ఏకగ్రీవమయ్యాయి. రేపే మొదటి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో నిమ్మగడ్డ నిర్ణయం జగన్ సర్కార్ కు ఊరటనిచ్చింది.

ఇటీవల చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 110 మంది, గుంటూరు జిల్లాలో 67 మంది సర్పించ్ లు ఏకగ్రీవమయ్యారు. ఈ జిల్లాల్లో అత్యధిక ఏకగ్రీవాలు కావడంతో వాటిని హోల్డ్ లో పెట్టాలని ఆయా జిల్లాల కలెక్టర్లను నిమ్మగడ్డ ఆదేశించారు. వీటిని నిమ్మగడ్డ హోల్డ్ లో పెట్టడంతో అధికార పార్టీ నేతలు, మంత్రులు సైతం నిమ్మగడ్డపై దుమ్మెత్తిపోశారు. మంత్రి పెద్దిరెడ్డి సహా కొందరు మంత్రులు ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆదేశాలను పట్టించుకోకుండా ఫలితాలను ప్రకటించాలని.. నిమ్మగడ్డ మాట వింటే చర్యలు తప్పవని హెచ్చరించారు.

తాజాగా ఈరోజు గవర్నర్ తో భేటి తర్వాత నిమ్మగడ్డ రమేశ్ వెనక్కితగ్గారు. పెండింగ్ లో పెట్టిన ఏకగ్రీవాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లకు సమాచారం అందించారు.దీంతో ప్రభుత్వానికి, ఆయా పంచాయతీలకు గొప్ప ఊరట లభించినట్టైంది.