Begin typing your search above and press return to search.

జ‌ర్న‌లిజంలోకి ఓలా ఎంట్రీ..వార్త‌ల్లో వీరి స్టైలే వేరు

By:  Tupaki Desk   |   1 April 2018 7:22 AM GMT
జ‌ర్న‌లిజంలోకి ఓలా ఎంట్రీ..వార్త‌ల్లో వీరి స్టైలే వేరు
X
ప్ర‌ముఖ ర‌వాణ సేల సంస్థ ఓలా గురించి ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. ట్యాక్సి సేవ‌ల‌ను అందించ‌డంలో ఓలా టాప్‌ లో ఉంది. అయితే ఈ వ్యాపారానికి తోడుగా జ‌ర్న‌లిజంలోకి అడుగు పెడుతున్న‌ట్లు ఓలా ప్ర‌క‌టించింది. అయితే ఇందుకు కొత్త‌గా జ‌ర్న‌లిస్టుల నియామ‌కం - ఓలా ఏదో ప‌త్రిక‌నో...టీవీనో ప్రారంభించ‌డం వంటివి చేయ‌ట్లేదు. త‌న డ్రైవ‌ర్ల‌నే `ఘోస్ట్‌ జ‌ర్న‌లిస్టులు`గా మార్చేస్తోంది. స్థానిక స‌మాచారాన్ని మ‌రింత వివరంగా అందించ‌డం త‌మ ల‌క్ష్య‌మ‌ని వివ‌రిస్తోంది.

ఓలా కంపెనీ అభిప్రాయం ప్ర‌కారం సంప్ర‌దాయ‌ న్యూస్ పేప‌ర్లు, చానెళ్లతో పాటుగా ఇటీవ‌ల వెల్లువ‌లా వ‌చ్చిన వెబ్ సైట్లు - యూట్యూబ్ చానెళ్లు - యాప్‌ ల ద్వారా పెద్ద ఎత్తున్నే స‌మాచారం వెంట‌వెంట‌నే అందుతోంది. అయితే ఇందులో స్థానిక స‌మాచారానికి త‌క్కువ ప్రాధాన్యం ద‌క్కుతోంది. ఆయా న‌గ‌రాల్లో ఉన్న ఎఫ్ ఎమ్ స్టేష‌న్ల ద్వారా సిటీ న్యూస్ ఎంతో కొంత తెలుసుకునే వీలున్న‌ప్ప‌టికీ అది కూడా పూర్తి స్థాయిలో లోతైన స‌మాచారం ఇవ్వ‌లేక‌పోతోందట‌. ఈ నేప‌థ్యంలో స్థానిక వార్త‌ల‌ను మరింత స‌మ‌గ్రంగా అందించేందుకు తాము జ‌ర్న‌లిజంలోకి వ‌స్తున్న‌ట్లు వివ‌రిస్తోంది. దేశంలోని 110 నగరాల్లో ఓలా త‌ర‌ఫున 10 ల‌క్ష‌ల‌ మంది డ్రైవర్లు అందిస్తున్నార‌ని వీరి ద్వారా `ప‌క్కాలోక‌ల్ న్యూస్‌` అందిస్తామ‌ని ఓలా చెప్తోంది.త‌మ డ్రైవ‌ర్లే త‌మ బ‌లం అని వివ‌రిస్తోంది.

త‌మ‌ డ్రైవర్లు త‌మ విధి నిర్వ‌హ‌ణ‌లో భాగంగా ఆయా ప్ర‌ధాన ప్రాంతాల‌తో పాటుగా గ‌ల్లీల్లో కూడా తిరుగుతుంటార‌ని పేర్కొంటూ వారి ద్వారా స‌మాచారం సేక‌రిస్తుంటామ‌ని ఓలా వివ‌రిస్తోంది. ఇంత‌ విస్తృత‌మైన నెట్‌వ‌ర్క్ క‌లిగిన త‌మ బృందంతో న‌గ‌రంలోని ట్రాఫిక్‌,వాతావ‌ర‌ణం, ఈవెంట్లు ప్ర‌త్యేకంగా అందిస్తామ‌ని పేర్కొంటోంది. ఓలా యాప్ ద్వారా వీటితో పాటు రాజ‌కీయం - క్రీడ‌లు - స్టాక్ మార్కెట్ వంటి విశ్లేష‌ణ‌లు తాజా వార్త‌లు అందించ‌నున్న‌ట్లు తెలుపుతోంది. త‌మ నూత‌న ప్ర‌య‌త్నానికి సంబంధించి ఓ ప్రోమో వీడియోను యూట్యూబ్‌లో విడుద‌ల చేసింది. ఈ కొత్త యాప్ ఎంత మేర‌కు నిల‌దొక్కుకుంటుందో వేచి చూడాల్సిందే.