Begin typing your search above and press return to search.
గల్ఫ్ షేక్ ఫోన్ తలాక్ తో పాతబస్తీలో కలకలం
By: Tupaki Desk | 26 Dec 2017 11:12 AM GMTఅరబ్ షేక్‌ల కాంట్రాక్టు పెళ్లిల్లకు అడ్డాగా మారిపోయిన హైదరాబాద్ పాతబస్తీలో తాజాగా మరో సంఘటన తెరమీదకు వచ్చింది. అయితే గతంలో వలే కాంట్రాక్టు వివాహం ఉదంతం కాదు... తలాక్ కేసు. ఒమన్ షేక్ ఒకరు తన కామ వాంచను తీర్చుకునేందుకు వివాహం చేసుకొని...తలాక్ చెప్పేసిన విషయం బయటికొచ్చింది. అందులోనూ ఫోన్ ద్వారా తలాక్ చెప్పడం, అంతకుముందు మోసం చేయడం గమనార్హం.
పహడీషరీఫ్ కు చెందిన గౌసియా బేగంను ఒమన్ దేశస్థుడైన జహ్రాన్ అహ్మద్ 2008లో గౌసియా బేగంను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లికు ముందు 10 లక్షలు పెట్టి భార్యకు సొంతిల్లు కొనిస్తానని ఒప్పందం చేసుకున్నాడు. అనంతరం ఆమెను వాడుకున్న ఒమన్ షేక్ ఆ తర్వాత ఆమెను మోసం చేశాడు. ఎలాగోలా ఇండియాకు పంపించేశాడు. తాజాగా ఒమన్ నుంచి ఫోన్ చేసి ఆమెకు తలాక్ చెప్పాడు. దీంతో బాధితురాలు గౌసియా బేగం షాక్ కు గురైంది. తనకు న్యాయం చేయాలని కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌కు లేఖ రాసింది.
కాగా, సౌదీ అరేబియా - ఒమన్ - దుబాయ్ నుంచి వచ్చిన షేక్ లు కాంట్రాక్టు పెళ్లిళ్ల పేరుతో పాతబస్తీ అమ్మాయిల జీవితాలు నాశనం చేస్తున్నారనే వార్తలు పెద్ద ఎత్తున్నే వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మోసాలకు కొసాగింపుగా అన్నట్లుగా.... కాంట్రాక్టు పెళ్లి గడువు ముగిసిపోగానే సింపుల్ గా తలాక్ చెప్పేస్తున్నారు. తలాక్ చెప్పిన తర్వాత పాతబస్తీ యువతుల జీవితాలు అగమ్యగోచరంగా మారిపోతున్నాయి.