Begin typing your search above and press return to search.

కామం కోసం వావివరసలు మరుస్తున్న వైనం

By:  Tupaki Desk   |   21 Dec 2021 12:39 PM IST
కామం కోసం వావివరసలు మరుస్తున్న వైనం
X
సమాజంలో కొన్ని సంఘటనలను చూస్తే మనం ఏ లోకంలో ఉన్నామో అర్థం కావడం లేదు. ఓ వైపు టెక్నాలజీ పెరుగుతుందని సంబరపడాలో.. సమాజం చెడిపోతుందని బాధపడాలో అర్థం కానీ పరిస్థితి దాపురించింది. ముఖ్యంగా లైంగిక దాడుల వార్తలు ప్రతిరోజూ వినాల్సి వస్తోంది.

కామంతో కళ్లు మూసుకుపోయిన కొందరు తమ కామా వాంఛ తీర్చుకోవడానికి అడ్డదారులు పడుతున్నారు. పోర్న్ వీడియోస్ మాయలో పడిన కొందరు వావి వరసలు కూడా మరిచి లైంగిక దాడికి పాల్పడతున్నారు. సమాజంలో గౌరవించుకునే బంధాలు కామ వాంఛకు బలవుతున్నాయి. దీంతో కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతున్నాయి.

కామకోరికలు ఉద్రేకం పెరిగిన కొందరు ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. అయితే ఇందుకు పోర్న్ వీడియోస్ కూడా కారణమవుతున్నాయి. చేతిలో మొబైల్ ఉంటే చాలు రకరకాల వీడియోలు చూసిన కొందరు అలాంటి కామ క్రీడను కోరుకుంటున్నారు. ఈ క్రమంలో కాస్త అందంగా ఉన్నవారెవరైనా సరే చూడకుండా వారిపై లైంగిక దాడికి పాల్పడతున్నారు. సులువుగా డబ్బులు సంపాదించే మార్గాన్ని ఎంచుకున్న కొందరు ఇలా వచ్చిన డబ్బుతో కామ కోరికలను తీర్చుకుంటున్నారు.

ఇటీవల కాలంలో ఇలాంటివి విపరీతంగా పెరిగాయి. కొన్ని రోజుల కిందట కోడలి కామ వాంచ తీర్చేందుకు మామ వయగ్రా గోలీలు మింగడం సంచలన రేపింది. ఆ టాబ్లెట్టు మింగిన వృద్ధు గుండెపోటుతో మరణించాడు. ఆలస్యంగానైనా ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు కోడలిని అరెస్టు చేశారు.

ఇక కొన్ని ప్రాంతాల్లో అల్లారు ముద్దుగా పెంచుకున్న కన్నబిడ్డల్ని సైతం కొందరు క్రూర తండ్రులు వదలడం లేదు. తమ కనురెప్పను తామే పొడుచుకున్నట్లు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.

దారుణమైని ఈ సంఘటనలు వెలుగులోకి వస్తున్నప్పటికీ చట్టాలు నామమాత్రంగానే పనిచేస్తున్నాయి. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోకపోవడంతో అఘాయిత్యాలు మరింతగా పెరుగుతున్నాయి. చిన్న పిల్లలపై కొందరు నరమృగాలు క్రూరంగా దాడులు చేసినా పట్టించుకపోవడంతో సమాజంలో మరిన్ని క్రూర మృగాలు తయారవుతున్నాయి. అయితే కొన్ని దేశాల్లో అమలు చేసే కఠిన చట్టాలను ఈ విషయంలో అమలు చేయాలని అంటున్నారు. కానీ ఆ దిశగా ప్రభుత్వం వెళ్లడం లేదు.

మొన్నటి వరకు కేంద్ర ప్రభుత్వం పోర్న్ వీడియోస్ పై అడ్డుకట్ట వేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఏదో రకంగా ఈ వీడియోస్ ను ఒకరి నుంచి మరొకరు పంపించుకుంటున్నారు. ఇందులో చూసిన యువత ఎక్కువగా చెడిపోతుంది. చదువుకోవాల్సిన వారి వీటికి అడిక్ట్ గా మారి వారేం చేస్తున్నారో అర్థంకాని పరిస్థితిలో ఉంటున్నారు. అందువల్ల ఇప్పటికైనా ఇలాంటి విషయాల్లో ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలు తీసుకోకపోతే ముందు ముందు మరిన్ని ఘోరాలు చూసే ప్రమాదం లేకపోలేదని అంటున్నారు.