Begin typing your search above and press return to search.
రోజు ఇంటర్నెట్ వినియోగిస్తున్న వారిలో సామాజిక ఒంటరితనం ఎక్కువ
By: Tupaki Desk | 20 May 2020 4:02 PM GMTజర్నల్ ఏజింగ్ అండ్ సొసైటీ ఇటీవల వృద్ధులపై జరిపిన పరిశోధనలో ఆసక్తికర విషయం వెల్లడైంది. వృద్ధులలో ఎప్పుడో ఓసారి ఆన్‌లైన్‌లోకి వెళ్తున్న వారి కంటే నిత్యం ఇంటర్నెట్ వినియోగించే వారు సామాజికంగా ఒంటరిగా ఉండే అవకాశం ఎక్కువగా ఉందని పరిశోధకులు గుర్తించారు. నిత్యం ఇంటర్నెట్ ఉపయోగించడం సామాజిక ఒంటరితనానికి దారితీసే పరిస్థితులు ఉన్నాయని తేలింది.
ఇటీవల ఇంగ్లాండులో సగటున 64 ఏళ్లు ఉన్న 4,492 మంది నుంచి ఈ పరిశోధన కోసం డేటాను సేకరించారు. ఇందులో 19 శాతం మంది అధికంగా ఒంటరితనం ఫీల్ అయ్యారు. 33 శాతం మంది సామాజికంగా ఒంటరిగా ఉన్నట్లు గుర్తించారు. వీరికి సమాజంతో సంబంధాలు తక్కువగా ఉన్నాయని అర్థం. అయితే కుటుంబంతో గడిపుతారు.
మరోవైపు, ప్రతిరోజు ఇంటర్నెట్ వాడుతున్న వారి కంటే ఎప్పుడో ఓసారి ఉపయోగించే వృద్ధులు సామాజికంగా ఒంటరిగా ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు యూకేలోని ఆంగ్లియా రస్కిన్ వర్సిటీ జరిపిన పరిశోధనలో తేలింది. ముడింట రెండొంతుల మంది రోజూ ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారని తేలింది. నిత్యం నెట్ ఉపయోగిస్తూ, అందులోనే మునిగిపోవడంతో అలాంటి వారిలో సామాజిక ఒంటరితనం ఎక్కువగా ఏర్పడుతోందని పరిశోధకులు చెబుతున్నారు.