Begin typing your search above and press return to search.
చెత్త కుండిలో వెయ్యి ...ఏటీఎంల్లో యాభై 'నోట్లు'
By: Tupaki Desk | 10 Nov 2016 4:49 PM GMTసాధారణంగా ఒకింత పెద్ద లావాదేవీల్లో మాత్రమే కనిపించే వెయ్యి నోట్లు ఇపుడు వంద రూపాయల కంటే తక్కువ విలువ పలుకుతున్న సంగతి తెలిసిందే. అయితే వెయ్యి నోటు విలువ వంద కాగితం కాదు కదా...చిత్తు కాగితంతో సమానమైపోయిన పరిస్థితి. పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో జనానికి వింత అనుభవాలు ఎదురవుతున్నాయి. పాత నోట్లకు సంబంధించి రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మీడియాలో స్ఫష్టంగా చెబుతున్నప్పటికీ కొందరు పాత నోట్లు చెల్లవనే ఆందోళనతో వాటిని పారేసుకోవడమో కాల్చివేయడమో చేస్తున్నారు. కొంత మంది తమ డబ్బులు ఇక వృథా కానున్నాయని మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నారు.
అంతే కాక పెద్ద నోట్ల రద్దు ప్రకట వెలువడినప్పటినుంచి బ్లాక్ మనీ ఏదో రూపంలో బయటికి వస్తోంది. తక్కువ మొత్తంలో ఉన్నవారు బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటున్నారు. ఎక్కువ మొత్తం ఉన్నవారు చెత్తకుప్పల్లో పారేసుకుంటున్నారు. ఇలాంటి సంఘటనే పుణెలో జరిగింది. ప్రభుత్వం రద్దు చేసిన వెయ్యి రూపాయల నోట్లు రూ. 52 వేల విలువ చేసేవి చెత్త కుప్పలో పడేశారు. 52 నోట్లు ప్లాస్టిక్ కవర్లో చుట్టి చెత్త కుండిలో పడేయగా పారిశుద్ధ్య కార్మికులరాలు గుర్తించింది. ఈ విషయాన్ని ఆమె తన పై అధికారికి తెలుపగా అతను పోలీసులకు సమచారం అందించారు. బ్లాక్ మనీ ఉన్నవారెవరో బ్యాంకులో డిపాజిట్ చేసుకోవడానికి వీలైనంత ఉంచుకుని మిగత డబ్బులు ఇలా చెత్తకుప్పలో పడేసి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు.
ఇక పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సమయంలో ఇబ్బంది పడిన వారు బ్యాంకులు తెరవడంతో ఆనందించారు. హాయిగా బ్యాంకులకు వెళ్లి పాత నోట్లు మార్చుకుని, కొత్త నోట్లు, కొంత చిల్లర తీసుకోవచ్చునని భావించిన వారి ఆనందం ఎంతో సేపు నిలువలేదు. బ్యాంకుల్లో వారికి కొత్త రెండు వేల రూపాయిల నోట్లను చేతిలో పెట్టి పొమ్మంటున్నారు. వంద నోట్లు కాని, అంతకంటే తక్కువ నోట్లు కాని ఇవ్వడం లేదు. దీనితో హతాశులైన సామాన్య ప్రజానీకం ఈ నోట్లకు చిల్లర ఎవరిస్తారంటూ కనిపించిన బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. సంజయ్ పాటిల్ అనే వ్యక్తి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రనుంచి ఆరు వేల రూపాయిలు విత్ డ్రా చేసుకోవడానికి వచ్చాడు. అతడికి రెండు వేల రూపాయిల నోట్లు మూడు చేతిలోపెట్టి పొమ్మన్నారు. వంద రూపాయిల కట్ట ఇస్తారని అతడు ఆశించినా ఉపయోగం లేకపోయింది. అక్కడినుంచి చిల్లర కోసం తిరుగుతూ యాక్సిస్ బ్యాంకు వద్దకు చేరుకున్నాడు. 2 వేల రూపాయిల నోటకు ఎక్కడా చిల్లర దొరకలేదని అందుకే ఇక్కడకు వచ్చానని చెప్పాడు. అతడిలాగానే మరి కొందరు కూడా రెండు వేల రూపాయిల నోట్లు పట్టుకుని చిల్లర కోసం తిరుగుతూ కనిపిస్తున్నారు.
ఇదిలాఉండగా...పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఏటీఎమ్ లలో ఇక నుంచి 50 రూపాయల నోట్లు కూడా ఉంచాలని రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించింది. చిల్లర కొరత తలెత్తకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దేశ వ్యాప్తంగా అన్ని బ్యాంకులకూ ఆదేశాలు జారీ చేసింది. ఏటీఎమ్ లలో కొత్త 500, 1000 రూపాయల నోట్లతో పాటు 50 రూపాయల నోట్లు కూడా లభించనున్నాయి.