Begin typing your search above and press return to search.

జోలె పట్టిన బాబు కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన వృద్ధురాలు !

By:  Tupaki Desk   |   10 Jan 2020 10:05 AM GMT
జోలె పట్టిన బాబు కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన వృద్ధురాలు !
X
డీపీ అధినేత - ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకి సరైన సమాధానం చెప్పి - అయన నోటి వెంట మరో మాట రాకుండా చేసింది ఒక వృద్ధురాలు. ఆ వృద్ధురాలు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేక బాబు సైలెంట్ గా అక్కడి నుండి తప్పుకున్నాడు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది ? బాబు ఏమి అడిగాడు ? ఎందుకు అడిగాడు అనే విషయాలని ఇప్పుడు చూద్దాం ...

చంద్రబాబు నాయుడు అధికారం లో ఉన్నప్పుడు గుర్తుకురాని రైతు సమస్యలు ..ఇప్పుడు రాజధాని మార్పు అనగానే గుర్తుకి వచ్చాయి. అలాగని ప్రభుత్వం అమరావతి నుండి మొత్తం రాజధానిని మార్చుతుందా అంటే అదీ లేదు. అమరావతి తో పాటుగా మరో రెండు రాజధానులని ఏర్పాటు చేయాలనీ భావిస్తున్నట్టు తెలిపింది. రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి జరగాల్సిందే కదా..ఒకేచోట జరిగితే మరోసారి తెలంగాణ ఉద్యమం లాంటిది ప్రారంభం కావచ్చు అని భావించి మూడు రాజధానుల నిర్ణయానికి వచ్చింది.

కానీ , చంద్రబాబు మాత్రం అమరావతి నుండి రాజధాని ని తరలిస్తే ..తమ భూములకు - తమ వారి భూములకు ఎక్కడ రేట్లు తగ్గిపోతయో అని భావించి రైతులని అడ్డుపెట్టుకొని - వారిని ప్రభుత్వం పైకి ఉసిగొల్పుతున్నాడు. ఇక ఈ నేపథ్యంలోనే రాజధానిని అమరావతిలోని ఉంచాలంటూ మచిలీపట్నంలో తాజాగా ఒక సభ నిర్వహించారు. ఈ సభకి పట్టుపని వెయ్యి మంది కూడా రాకపోవడం గమనార్హం. జనం లేక సభ మొత్తం వెలవెలబోయింది. టీడీపీ అధినేత విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ నుంచి కంకిపాడు - ఉయ్యూరు - పామర్రు మీదుగా బందరు చేరుకున్నారు.

అయితే ,దారి పొడవునా ఎక్కడా జన స్పందన లేకపోగా, -మచిలీపట్నం సభకు సైతం జనం రాకపోవడంతో కంగుతిన్నారు. కోనేరు సెంటర్‌ లో సభ ప్రారంభం కావాల్సిన మధ్యాహ్నం మూడుగంటల సమయానికి పట్టుమని 200 మంది లేకపోవడంతో టీబ్రేక్‌ పేరిట సుల్తాన్‌ పురం వద్దే ఆగిపోయారు. సాయంత్రం 4.15 గంటలకు బందరు చేరుకున్నారు. అయినా జనం లేకపోవడంతో భిక్షాటన పేరుతొ కోనేరు సెంటర్‌ నుంచి మున్సిపల్‌ కార్యాలయం వరకు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఓ వృద్ధురాలి వద్దకెళ్లి డబ్బులు వేయాలని అభ్యర్థించగా.. నీకెందుకేయాలి? ఏం చేశావని వేయాలి? అని ఆమె నిలదీసింది. అమరావతి కోసమని చంద్రబాబు బదులిస్తుండగా..అమరావతిని నువ్వు ఏమైనా కట్టావా? అని ఆమె ఎదురు ప్రశ్నించడంతో చంద్రబాబు అక్కడి నుంచి కామ్ గా వెళ్లిపోయారు. అలాగే సభలో మాట్లాడుతున్న సమయంలో అమరావతి కి జై కొట్టాలని పదేపదే అభ్యర్థించినా జనం నుంచి స్పందన మాత్రం రాలేదు. ఈ సభా వేదికగా చంద్రబాబు మాట్లాడుతూ కొన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసారు. ఈ ఉద్యమం నా కోసం కాదు అని - మీ భవిష్యత్‌ కోసమే ఉద్యమిస్తున్నానని - తాను చేస్తున్న ఈ ఉద్యమానికి ఇంటికొకరు చొప్పున మద్దతునివ్వాలన్నారు. ఈ సందర్భంగా జోలిపట్టి సేకరించిన రూ.3.10 లక్షలను అమరావతి జేఏసీ నేతలకు అందజేశారు.