Begin typing your search above and press return to search.

బామ్మ పాటకు బాబు ఫిదా

By:  Tupaki Desk   |   9 Jun 2017 7:16 AM GMT
బామ్మ పాటకు బాబు ఫిదా
X
ఏపీలో పాలక టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తలపెట్టిన నవనిర్మాణ దీక్షలు వెలవెలబోయినా ఆయనకు మాత్రం చివర్లో గొప్ప సంతోషం కలిగించిన ఘటన ఒకటి జరిగింది. దీక్ష ముగింపు సందర్భంగా కాకినాడలో ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు పాల్గొనగా... ఆ సందర్భంగా ఓ వృద్ధురాలు ఆయన్ను చూసేందుకు ఆసక్తి కనబరించింది. దీంతో ఆయన ఆ వృద్ధురాలిని వేదికపైకి పిలిచి మాట్లాడే అవకాశం కల్పించారు. వేదికపై నుంచి మాట్లాడిన ఆ వృద్ధురాలు.. అక్కడితో ఆగకుండా చంద్రబాబు కోసం ఒక పాట పాడుతానని చెప్పింది. చంద్రబాబు సరేనని తలూపడంతో ఆమె పాట అందుకుంది.

'చంద్రబాబు.. నిన్ను చూడాలని ఉంది.
గోడల మీద, గుండెల మీద చూశాను.
అయినా నా కడుపు నిండలేదు..కళ్లు నిండలేదు.
నెలకు రెండొందల పింఛన్ పోయి.. వెయ్యి రూపాయలు చేశావు.
మా బోటివాళ్లకు పెద్దకొడుకువయ్యావు.
నీ తల్లికే నీవు కొడుకువి కాదయ్యా' అంటూ పాట పాడారు.

దీంతో ఆ వృద్దురాలి పాటకు చంద్రబాబు తెగ హ్యాపీగా ఫీలయ్యారు. ఆపై ఆమె యోగ క్షేమాలు స్వయంగా అడిగి తెలుసుకోవడంతో ఆమె కూడా చాలా సంతోషించింది. అయితే... విపక్ష నేతలు మాత్రం అదంతా హంబక్ అంటున్నారు. చంద్రబాబుకు, టీడీపీ నేతలకు ఇలాంటి ఏర్పాట్లు చేయడం వెన్నతో పెట్టిన విద్య అని.. అంతా ముందుగా చేసిన ఏర్పాటు ప్రకారం ఆమెను వేదిక వరకు తీసుకెళ్లి చంద్రబాబు పిలిచేలా స్కెచ్ వేసి ఈ ప్రశంసల పాట పాడించారని అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/