Begin typing your search above and press return to search.
నోట్ల రద్దు, వ్యభిచారంపై చర్చ ఒకటే
By: Tupaki Desk | 19 Dec 2016 5:25 AM GMTఆర్థికశాస్త్రంలో నోబుల్ బహుమతి గ్రహీతలైన ఓలివర్ హార్ట్ - బెంగ్ట్ హాల్మ్‌స్ట్రామ్ భారతదేశ ప్రభుత్వం తీసుకున్న రూ.500 - రూ.1000 నోట్ల రద్దు నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దనోట్లను రద్దుచేస్తూ భారత ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని సమర్థించలేమని అన్నారు. నల్లధనాన్ని రూపుమాపేందుకు ఇది సరైన ప్రత్యామ్నాయం మాత్రం కాదని విశ్లేషించారు. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే నల్లధనం.. వ్యభిచారంపై చర్చ రెండూ ఒకటేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యభిచారాన్ని కొన్ని సమాజాలు అంగీకరించలేవు, కానీ, దానిని న్యాయబద్ధం చేస్తే అందులో పనిచేస్తున్న మహిళలకు చట్టభద్రత లభిస్తుంది అని ఆర్థికశాస్త్రంలో నోబుల్ బహుమతి గ్రహీతలైన ఓలివర్ హార్ట్ - బెంగ్ట్ హాల్మ్‌స్ట్రామ్ విశ్లేషించారు.
ఇదిలాఉండగా పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని కేంద్ర మంత్రి ఎం వెంకయ్యనాయుడు మళ్లీ ప్రశంసించారు. కృష్ణాజిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోడీ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. ప్రధాని నిర్ణయాన్ని ప్రజలంతా స్వాగతిస్తున్నారని తెలిపారు. తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడినా దీర్ఘకాలంలో దేశానికి ప్రయోజనం చేకూరుతుందని వెంకయ్య నాయుడు జోస్యం చెప్పారు. నోట్ల రద్దుతో అవినీతి - నల్లధనం నివారణ సాధ్యమని అన్నారు. నగదు రహిత లావాదేవీల సాధనే ప్రభుత్వ లక్ష్యమని - దీనికి అన్ని రాష్ట్రాలు సహకరించాలని వెంకయ్య నాయుడు విజ్ఞప్తి చేశారు. అందరికీ బ్యాంకు ఖాతాలు సాధ్యమా? అని గతంలో తనకు సందేహం ఉండేదని, అయితే మోడీ దాన్ని పటాపంచలు చేశారని అన్నారు. పెట్రోల్ బంకుల్లో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు జరుగుతున్న చర్యలపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆరాతీశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/