Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ అభ్యర్థిగా బాక్సర్ విజేందర్

By:  Tupaki Desk   |   23 April 2019 6:11 AM GMT
కాంగ్రెస్ అభ్యర్థిగా బాక్సర్ విజేందర్
X
క్రీడాకారులకు ఎర్రతివాచీ పరిచిన బీజేపీ ఎత్తుగడను కాంగ్రెస్ కూడా అందుకుంది. ఆ పార్టీ కూడా తాజాగా ఓ క్రీడాకారుడికి టికెట్ ను ఇచ్చింది. ఈ ఎన్నికల్లో ఎంతో మంది ప్రముఖులకు బీజేపీ, కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఆఫర్లు ఇచ్చాయి. ముఖ్యంగా దేశరాజధాని ఢిల్లీకి సంబంధించిన ఎంపీ సీట్లలో ప్రముఖలను పోటీకి దింపేందుకు రెడీ అయ్యారు.

తాజాగా ప్రకటించిన జాబితాలో కాంగ్రెస్ పార్టీ బాక్సర్ విజేందర్ సింగ్ ను తమ ఎంపీ క్యాండిడేట్ గా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

సౌత్ ఢిల్లీ పార్లమెంట్ స్థానం నుంచి బాక్సర్ విజేందర్ కాంగ్రెస్ తరుపున నిలబడుతున్నారు. ఢిల్లీ మాజీ సీఎం షీలాదీక్షిత్, అజయ్ మాకెన్ లతోపాటు వివిధ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. అనూహ్యంగా విజేందర్ కు సౌత్ ఢిల్లీ స్థానాన్ని కట్టబెట్టింది.

2008లో బీజింగ్ ఒలింపిక్స్ లో విజేందర్ పతకం సాధించారు. ఢిల్లీ సౌత్ నియోజకవర్గం నుంచి ఈ బాక్సింగ్ చాంపియన్ పోటీకి దిగుతున్నారు. అక్కడ బీజేపీ నుంచి రమేష్ బిదౌరీ, ఆప్ తరుపు నుంచి రాఘవ్ చద్దాలు పోటీలో ఉన్నారు.

కాగా ఢిల్లీలోని పార్లమెంట్ స్థానాలపై కాంగ్రెస్-ఆప్ లు కలిసి పొత్తు పెట్టుకొని బరిలోకి దిగుదామని ఆలోచించాయి. కానీ సీట్ల సర్దుబాటులో పొత్తు పొడవక కుదరలేదు. దీంతో విడివిడిగానే పోటీచేస్తున్నాయి.