Begin typing your search above and press return to search.

భారత్-పాక్ యుద్ధంలో ఓంపురి ఆత్మ

By:  Tupaki Desk   |   19 April 2017 6:17 AM GMT
భారత్-పాక్ యుద్ధంలో ఓంపురి ఆత్మ
X
ఇండియా - పాకిస్థాన్ ల మధ్య కొద్దికాలంగా టెన్షన్స్ తీవ్రంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పాక్ మీడియా కూడా మనకు సంబంధించిన వ్యవహారాలపై అతిగా జోక్యం చేసుకుంటూ కథనాలు రాస్తోంది. గతంలో నవ్యాంధ్రలో శాసనసభ భవనాల నమూనాలను చూపించి అణ్వయుధాగారం అని ప్రచారం చేస్తూ కథనాలు వేసింది. తాజాగా... మరో కొత్త రకం ప్రచారంతో అక్కడి మీడియా కథనాలు వేస్తోందట. ఆ కథనాలకు మన మీడియా సంస్థలు కొన్ని కౌంటర్ స్టోరీలు వేయడం విశేషం. దీంతో ఇండియా - పాక్ మీడియా మధ్య యుద్ధ వాతావరణం మొదలైంది... ఇదంతా దివంగత నటుడు ఓంపురి కేంద్రంగా సాగుతున్నాయి.

ఇంతకీ విషయం ఏంటంటే.... గత జనవరిలో మరణించిన ఓంపురి తన మరణానికి కొద్ది రోజుల ముందు యూరీ సెక్టార్లో దాడులు - సర్జికల్ స్ట్రయిక్స్ నేపథ్యంలో ఓంపురి కొన్ని వ్యాఖ్యలు చేశారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ టార్గెట్ గా ఆయన మాట్లాడారు. అప్పట్లో అది కాస్త వివాదమైంది. ఆ తరువాత కొద్దికాలానికే ఆయన మరణించారు. అయితే... పాక్ మీడియా దీనిపై చిలవలుపలవలుగా కథనాలు వేస్తోంది. ఓంపురి ఆత్మ ముంబైలోని ఆయన నివాసం ముందు తిరుగుతోందని, భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పై పగతీర్చుకునేందుకు అది అక్కడ తిరుగుతోందని చెబుతూ...ఒక వీడియోను ప్రసారం చేసింది. సీసీ టీవీ ఫుటేజి అయిన ఆ వీడియోలో తెల్ల కుర్తా ధరించిన ఓ వ్యక్తి కనిపించగా, అది ఓంపురి ఆత్మ అని, ముంబైలోని తన ఇంటి ముందు తిరుగుతోందని పాకిస్థాన్ కెు చెందిన బోల్ న్యూస్ పేర్కొంది. దీనిని ఆ టీవీ ఛానెల్ గత జనవరి 14న ప్రసారం చేయగా, పాక్ కుట్రలు, కుతంత్రాలను బయటపెడుతూ ‘ఆజ్‌ తక్’ ఆ వీడియాను మొన్న వారాంతంలో ఖండిస్తూ కథనం ప్రసారం చేసింది.

యురి సెక్టార్ లో దాడుల విషయంలో ఓంపురి వ్యాఖ్యలు చర్చనీయమైన సంగతి తెలిసిందే... దీంతో ప్రధాని నరేంద్ర మోదీ, అజిత్ దోవల్ కలిసి ఓంపురి హత్యకు పథకం వేశారని... ఓంపురికి అజిత్ దోవల్ సమన్లు జారీ చేసి, విచారణలో దారుణంగా కొట్టారని, అందుకే ఓంపురి ఆత్మ పగతీర్చుకోవాలని చూస్తోందంటూ కథనం వండి వార్చింది. దీనికి మన మీడియా కౌంటరేసింది.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/