Begin typing your search above and press return to search.

సైన్యంపై ఓమ్ పురీ వివాదాస్పద వ్యాఖ్యలు!

By:  Tupaki Desk   |   4 Oct 2016 5:50 AM GMT
సైన్యంపై ఓమ్ పురీ వివాదాస్పద వ్యాఖ్యలు!
X
ఎవరు వారిని ఆర్మీలో చేరమన్నారు? ఎవరు వారిని ఆయుధాలు పట్టుకోమని అన్నారు? జవాన్లను ఆర్మీలో చేరమని మేమేమన్నా చెప్పామా? ఇజ్రాయిల్, పాలస్తీనా మాదిరి భారత్ - పాకిస్తాన్ లు కూడా యుగయుగాలుగా శత్రువులుగా మారలనుకుంటున్నారా? 15 - 20 మంది మానవ బాంబులను తయారుచేయండి! పాకిస్తాన్ ను పేల్చడానికి వాటిని వాడండి! భారత్-పాకిస్తాన్ విభజన అంటే కేవలం భౌగోళికంగా దేశాల విభజనే మాత్రమే కాదు, కుటుంబాలు విడిపోవడం కూడా. కోట్లమంది ముస్లింలకు భారత్ పుట్టినిల్లు. భారతీయుల కుటుంబసభ్యులు పాకిస్థాన్ లో కూడా ఉన్నారు. సరిహద్దు కుటుంబాలు ఎలా యుద్ధం చేసుకుంటారు? భారత సైనికులపై తాజాగా ఒక వ్యక్తి చేసిన కామెంట్స్ ఇవి. ఈ మాటలు విన్న ఎవరి రక్తం అయినా కుత కుతా ఉడుకుతుంది అనడంలో సందేహం లేదనే చెప్పాలి! ఈ మాటలు మాట్లాడింది మరెవరో కాదు ప్రముఖ నటుడు ఓమ్ పురీ.

ఒక న్యూస్ చానల్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న నటుడు ఓమ్ పురీ పైవ్యాఖ్యలు చేశారు. ఒక సగటు భారతీయుడు మాట్లాడాల్సిన మాటలా ఇవి, భారతమాత గుండెలపై గుద్దేవిగా ఈ మాటలు ఉన్నాయని ఈయనపై సర్వత్రా విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ఇదే సమయంలో సల్మాన్ మాదిరి వాదనకు తెరలేపిన ఓమ్ పురీ... పాకిస్థాన్ నటులంతా వాలిడ్ వీసాలతోనే ఇక్కడ పనిచేస్తున్నారని, వారిని నిషేధించడం సరికాదని అన్నారు. పాకిస్తాన్ నటులపై నిషేధం విధించాలంటే, ముందుగా భారత ప్రభుత్వాన్ని వారి వీసాలు రద్దు చేయమనండి అంటూ ఉచిత సలహా ఒకటి పాడేశారు. భారత దేశంలో వాక్ స్వాతంత్రపు హక్కు ఉందన్న ఒకే ఒక్క కారణంతో ఈయన ఇలా చెలరేగిపోతున్నారని విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఏకిపారేస్తున్నారు.

ఉడీ ఘటన అనంతరం పాకిస్తాన్ నటులపై భారత్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్(ఐఎమ్ పీపీఏ) నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై మాట్లాడుతూనే ఉడి ఘటనలో అమరవీరులైన భారత సైన్యంపై ఆయన అవమానకర వ్యాఖ్యలు చేశారు. ఉడి ఉగ్రదాడిలో అసువులు బాసిన 18 వీర జవాన్లపై ఓం పురీ ఒక భారతీయుడిగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నిస్సిగ్గు చర్య కాక మరేమిటని అంటున్నారు భారతీయులు!


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/