Begin typing your search above and press return to search.
మోడీ ఫోటోకు మాజీ సీఎం ఫిదా
By: Tupaki Desk | 4 Dec 2017 12:35 PM GMTప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అదే రీతిలో పలువురిలో స్పూర్తి నింపడంలో ఆయన ముందుంటారు. అలా రోడ్డు భద్రతా నియమాలు పాటించడంలో ముందున్న ప్రధాని తీరు ఓ మాజీ సీఎంను తెగ ముచ్చటపడేలా చేసింది. దీంతో ఆయన వెంటనే మోడీ ఫొటోను షేర్ చేశారు. గుజరాత్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మోడీ బిజీగా ఉన్న సమయంలో తీసినది ఈ ఫోటో.
స్వరాష్ట్ర ఎన్నికల్లో మోడీజీ బిజీగా ఉన్న సమయంలో ప్రచార కార్యక్రమం ముగించుకుని వెళుతున్నప్పుడు కారులో ముందు సీటులో కూర్చొని ఉన్నారు. ఈ సమయంలో సీటు బెల్టు ధరించారు. ఈ చిత్రం సోషల్ మీడియాలో పోస్ట్ అయింది. దీనిపై జమ్ముకాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా షేర్ చేశారు. ప్రయాణీకులు రోడ్లపై వెళ్లేటప్పుడు నిబంధనలు పాటించాలని ఇందుకు ప్రధాని నరేంద్ర మోడీని ఉదాహరణ అని పేర్కొన్నారు. అయితే ఈ విషయాన్ని ఆయన నేరుగా చెప్పకుండా సెటైర్ రూపంలో వర్ణించారు.
`రోడ్డు ప్రయాణం చేసే సమయంలో ముందు సీట్లో కూర్చుని సీట్ బెల్ట్ పెట్టుకోని వారికి ఒకటి చెప్పాలనుకుంటున్నా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముందు సీట్‌లో కూర్చున్నప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకుంటారు. కానీ ఆయన ట్రాఫిక్ పోలీసులకు భయపడి సీట్ బెల్ట్ పెట్టుకోరు.` అని ఒమర్ అబ్ధుల్లా పేర్కొంటూ..ప్రధానమంత్రి స్పూర్తిగా అంతా వాహనంలో ప్రయాణించే సమయంలో బెల్ట్ ధరించాలని కోరారు.