Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ కు వెన్నుపోటు పొడిచిందెవరు.?

By:  Tupaki Desk   |   15 May 2018 8:16 AM GMT
కాంగ్రెస్ కు వెన్నుపోటు పొడిచిందెవరు.?
X
వెన్నుపోటు.. బయటా సాధారణమే అయినా రాజకీయాల్లో మాత్రం ఈ పోటు పవర్ ఫుల్ లాంటిది.. అప్పట్లో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వెన్నుపోటుకు గురై గుండెపోటుతో మరణించాడు. ఈ వెన్నుపోటు గురించి చరిత్రలో ఓ కథ కూడా ఉంది..

ప్రముఖ రచయిత షేక్ స్పియర్ రచించిన జూనియస్ సీజర్ నాటకంలో రోమన్ చక్రవర్తి తన స్నేహితుడు బ్రూటస్ చేతితో హత్యకు గురవుతాడు. వెనుక నుంచి దొంగచాటుగా కత్తితో పొడచి స్నేహితుడి ప్రాణాలను బ్రూటస్ తీస్తాడు. తీరా తన స్నేహితుడే తన ప్రాణాలు తీశాడని తెలుసుకున్న జూలియస్ సీజ్ ‘ఇట్ టూ’ అని అంటాడు. దాని అర్థం బ్రూటస్ ‘నీవు కూడా వెన్నుపోటు పొడిచావా’ అని అర్థం..

జూలియస్ సీజర్ నాటకంలోని ఈ ఘట్టాన్ని వివరిస్తూ జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్ధుల్లా చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ కు కర్ణాటక కూడా వెన్నుపోటు పొడిచిందా అని అర్థం వచ్చే రీతిలో ఒమర్ ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది. జూలియస్ సీజర్ ను మార్చి 15నే హతమార్చాడని.. అదే విధంగా మే 15న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఓడించారని’ ఒమర్ తన ఆవేదనను వెల్లగక్కారు.

ఒమర్ అబ్దుల్లా ట్వీట్ ను బట్టి కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ ను వెన్ను పోటు పొడిచారని.. బీజేపీ గద్దెనెక్కించి తప్పు చేశారని అర్థమవుతోంది. స్వతహాగా కాంగ్రెస్ సానుభూతి పరుడైన ఒమర్.. కాంగ్రెస్ ఓటమిపై ఇలా ట్వీట్ ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు.