Begin typing your search above and press return to search.

మాజీ సీఎంకు చెకింగ్స్ చుక్కలు చూపించారు

By:  Tupaki Desk   |   17 Oct 2016 9:08 AM GMT
మాజీ సీఎంకు చెకింగ్స్ చుక్కలు చూపించారు
X
అగ్రరాజ్యమైన అమెరికా మనకు చాలా క్లోజ్ అంటే క్లోజ్ అని చెబుతుంటారు. నిత్యం విదేశీయుల మీద విషం కక్కే ట్రంప్ లాంటి కంపు నేత సైతం.. భారత్ అంటే తనకెంత ఇష్టమన్న విషయాన్ని చెప్పి.. తాను కానీ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తే మాత్రం.. రెండు దేశాల మధ్య దూరం బాగా తగ్గిపోతుందంటూ తియ్యతియ్యగా మాట్లాడతారు. నిజానికి అమెరికా ముఖ్యనేతలే కాదు.. చివరకు రష్యా లాంటి మిత్రదేశం సైతం అమెరికా మనతో క్లోజ్ గా మూవ్ అవుతుందని అసూయపడే పరిస్థితి.

ఒకవైపు ఇలాంటి పరిస్థితి ఉంటే.. మరోవైపు మనోళ్లకు తరచూ అవమానాలు గురయ్యే పరిస్థితి. సామాన్యుల సంగతి అయితే ఏమోలే అనుకోవచ్చు. అలా కాకుండా రాజకీయ ప్రముఖులు.. ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు ఉన్న నేతల విషయంలోనూ అమెరికా తన అగ్రరాజ్య అహంకారాన్ని ప్రదర్శించటం.. అందుకు భద్రతా కారణాలంటూ సాకులు చెప్పటం మామూలే.

తాజాగా అలాంటి భద్రతా కారణాలతో పగలే చుక్కలు కనిపించాయి జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు. తాజాగా ఆయన ఒక యూనివర్సిటీలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు న్యూయార్క్ కు వెళ్లగా.. అక్కడి ఎయిర్ పోర్ట్ లో ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. ఇమ్మిగ్రేషన్ తనిఖీలంటూ ఆయన సహనానికి పరీక్ష పట్టారు. దాదాపు తనిఖీల కోసం రెండు గంటల పాటు నిలిపివేయటంతో.. తన ఆక్రోశాన్నిట్విట్టర్ వేదికగా ఆయన వినిపించారు.

చెకింగ్ ల పేరుతో ఇలా చుక్కలు చూపించటం అమెరికాకు అలవాటేనని.. గతంలో తాను మూడుసార్లు అమెరికాకు వెళితే మూడుసార్లు ఇలాంటి పరిస్థితే చోటు చేసుకుందన్న ఆయన.. ప్రతిసారీ తనిఖీల పేరుతో గంటల కొద్ది వెయిట్ చేయిస్తారని చెప్పారు. టైం పాస్ కోసం పోకెమాన్ గో ఆడుకోవటానికి తాను షారూక్ ను కాదు కదా.. ఇలా తనిఖీల పేరుతో ఒత్తిడికి గురి చేస్తూ.. టైం వేస్ట్ చేస్తున్నారంటూ ఫీలయ్యారు. రాజకీయ నేతలు ఏ పార్టీకి చెందిన వారైనప్పటికీ.. ఇలాంటి ఉదంతాలపై భారత సర్కారు ఘాటుగా రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంది. వీలైతే ఇండియాకు వచ్చిన అమెరికన్ ముఖ్యనేతలకు భద్రతా తనిఖీల రుచి ఎలా ఉంటుందో మన అధికారులతో రుచి చూపిస్తే ఇష్యూ సెట్ అవుతుందేమో..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/