Begin typing your search above and press return to search.
మాజీ సీఎం విడాకుల పిటిషన్ కొట్టివేత
By: Tupaki Desk | 31 Aug 2016 8:15 AM GMTకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి - నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లాకు ఆయన భార్య పాయల్ నుంచి విడాకులు ఇచ్చేందుకు స్థానిక కోర్టు తిరస్కరించింది. ఒమర్ పెట్టుకున్న విడాకుల పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. ఈ సందర్భంగా జడ్జి కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. జమ్ము కాశ్మీర్ లో అబ్దుల్లా వంశానికి పెద్ద చరిత్రే ఉంది. ఒమర్ అబ్దుల్లా తండ్రి ఫరూక్ అబ్దుల్లా కూడా జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అలాంటి వంశానికి చెందిన ఒమర్ అమెరికాలో 1970లో పుట్టారు. తర్వాత ఆయన.. 1994లో పాయల్ అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నారు.
వీరికి ఇద్దరు మగ పిల్లలు కూడా పుట్టారు. అయితే, కుటుంబ కలహాల నేపథ్యంలో పాయల్ - ఒమర్ లు 2009లోనే విడిపోయారు. ప్రస్తుతం పాయల్ వేరుగా ఉంటున్నారు. ఇద్దరు పిల్లలూ ఆమె వద్దే ఉంటున్నారు. కాగా, పాయల్ నుంచి తనకు విడాకులు ఇప్పించాలని ఒమర్ జమ్ములోని స్థానిక కోర్టులో పిటిషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన భార్య పాయల్ పై కొన్ని ఆరోపణలు చేశారు. పాయల్ తనకు ఎలాంటి సుఖాన్ని ఇవ్వలేదని, పైగా మానసికంగా వేధించేదని, తన వల్ల అనేక ఇబ్బందులు పడ్డానని ఒమర్ తన పిటిషన్ లో పేర్కొన్నారు.
తీరా కోర్టు విచారణకు వచ్చే సరికి ఆయన పాయల్ పై చేసిన చేసిన ఏ ఒక్క ఆరోపణనూ ఆధారాలతో సహా నిరూపించలేకపోయారు. దీంతో కోర్టు ఒమర్ పెట్టుకున్న విడాకుల పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఇదిలావుంటే, ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో పనిచేసిన వారు ఇలా భార్యపై లేనిపోని ఆరోపణలతో విరుచుకుపడడంపై సర్వత్రా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు ఇలాంటి వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. మరి దీనిపై ఒమర్ నెక్ట్స్ స్టెప్ ఏంటో చూడాలి.