Begin typing your search above and press return to search.
అలాంటి మాట అనేందుకు నోరెలా వచ్చింది ఓమర్?
By: Tupaki Desk | 8 May 2016 4:53 AM GMTబాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన స్థానాల్లో ఉండే నేతలు బాధ్యత లేకుండా ఎందుకు మాట్లాడతారు? అన్న ప్రశ్న వేస్తే.. వచ్చే సమాధానం రాజకీయ ప్రయోజనం. రాజకీయ నేతలతో వచ్చే పెద్ద ఇబ్బంది ఏమిటంటే.. తమ స్వార్థం కోసం నేతలు చేసే వ్యాఖ్యలు సమాజం మీద ఎంతో ప్రభావితం చేయటమే కాదు.. దాని పర్యవసానాలు దారుణంగా ఉంటాయి. పాక్ సంతతికి చెందిన ఒక ముస్లిం తాజాగా బ్రిటన్ రాజధాని నగరమైన లండన్ కు మేయర్ గా ఎన్నిక కావటం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. లండన్ మేయర్ గా సాదిక్ ఖాన్ ఎన్నికైన సందర్భాన్ని పురస్కరించుకొని మాట్లాడిన జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఓమర్ అబ్డుల్లా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లండన్ ఎన్నికల ద్వారా మైనార్టీలు కూడా విజయం సాధించొచ్చని తేలిందన్నారు.
భారత్ లో ఒక మైనార్టీ వ్యక్తిని మేయర్ గా ఎన్నుకోవటం సాధ్యమవుతుందా? అంటూ విచిత్రమైన వ్యాఖ్యను చేశారు. రాజకీయాల మీద అవగాహన లేదని అనుకోవాలా? సంచలనాలకు తాను కేంద్రంగా భావించాలని ఓమర్ భావిస్తున్నారా? అన్న సందేహం ఆయన మాటల్లో వ్యక్తమవుతోంది. మేయర్ ఏమిటి ఖర్మ.. భారత దేశ రాష్ట్రపతిగానే ఒక ముస్లిం ఎంపికైన విషయాన్ని ఓమర్ మర్చిపోతున్నారా? అంతదాకా ఎందుకు ఒక ముస్లిం నేటికి భారతదేశ ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయాన్ని ఓమర్ మర్చిపోవటం ఏమిటి?
ఎక్కడిదాకానో ఎందుకు? ఆ మధ్యనే హైదరాబాద్ మేయర్ గా ముస్లిం నేత ఏలలేదా? మైనార్టీలకు దేశంలో పెద్ద పెద్ద పదవులు ఇవ్వరన్నట్లుగా చెబుతున్న ఓమర్ కు ఒక సూటి ప్రశ్న ఏమిటంటే.. జమ్మూకాశ్మీర్ లో మైనార్టీలు అయిన హిందువుకు ముఖ్యమంత్రి పదవి ఎందుకు దక్కటం లేదు? కాశ్మీర్ వ్యాలీలో మైనార్టీ వర్గానికి చెందిన హిందువులు.. ఇతర మతస్తులు ఎందుకు ఎన్నికకావటం లేదు? ఒక చిన్న రాష్ట్రంలో ఒక సమూహంలోని మైనార్టీలుగా ఉన్న ఇతర వర్గాలకు ఎలాంటి విలువ.. ఆదరణ.. ఎలాంటి పదవులు రాకున్నా మాట్లాడని వారు.. దేశంలో మైనార్టీలో ఉన్న వారికి పదవులు రాలేదంటూ ఎలా విమర్శలు చేస్తారు? నిజంగా మైనార్టీలకు పదవులు ఇవ్వకూడదన్న ఆలోచనే ఉండి ఉంటే.. ఒక అబ్దుల్ కలాం.. ఒక అన్సారీలు ఎందుకు అత్యున్నత పదవులకు ఎంపికయ్యారు.
నిజానికి ఈ ప్రశ్నను ముస్లిం నేతలందరిని ప్రశ్నించాలి. వారు మెజార్టీగా ఉండే ముస్లిం దేశాల్లో మైనార్టీలకు అత్యున్నత పదవుల్లో ఎందుకు ఎంపిక చేయరు? అసలు అలాంటి ఆలోచన కూడా చేయని వారు.. శ్రీరంగ నీతులు వల్లించటం ఏమిటి? తాము మెజార్టీలుగా ఉన్న ప్రాంతంలో మైనార్టీల సంక్షేమం కోసం.. వారి చేతికి పాలనా పగ్గాలు ఇవ్వటానికి ఏ మాత్రం ఇష్టపడని వారు.. మిగిలిన చోట్ల పదవులు లభిస్తున్న తప్పుడు వాదనల్ని తెర మీదకు తీసుకురావటం ఏమిటి? ఇలాంటి ఓమర్ అబ్దుల్లాల కారణంగానే మిడిమిడి అవగాహన ఉన్న వారు తప్పుడు ఆలోచనలతో తప్పుడు మార్గాల్ని ఎంచుకునే అవకాశం ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదు. అందుకే.. ఓమర్ లాంటి నేతలు బాధ్యతతో మాట్లాడితే బాగుంటుంది. రాజకీయ ప్రయోజనమే తప్పించి మరింకేమీ పట్టని ఓమర్ లాంటి వారి నుంచి బాధ్యతతో కూడిన మాటల్ని ఆశించగలమా..?