Begin typing your search above and press return to search.

బెంగాల్ కూడా కశ్మీర్ లా మారితే తప్పేంటి?

By:  Tupaki Desk   |   7 March 2021 12:44 PM GMT
బెంగాల్ కూడా కశ్మీర్ లా మారితే తప్పేంటి?
X
కశ్మీర్ ప్రముఖ నేత, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఒమర్ అబ్దుల్లా హాట్ కామెంట్స్ చేశారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నేత సువేందు అధికారి చేసిన వ్యాఖ్యలకు ఒమర్ కౌంటర్ ఇచ్చారు.

తాజాగా పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే బెంగాల్, కశ్మీర్ లా తయారవుతుందన్న బీజేపీ నేత సువేందు అధికారి వ్యాఖ్యలను ఒమర్ ఖండించారు. సువేందు వ్యాఖ్యలు అవివేకమన్నారు.

2019 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వ కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత కశ్మీర్ స్వర్గంలా మారిందని బీజేపీ చెబుతోంది. మరీ ఇప్పుడు బెంగాల్.. కశ్మీర్ లా మారితే తప్పేంటి అని ఒమర్ ప్రశ్నించారు.ఈ క్రమంలోనే బెంగాల్ ప్రజలు కూడా కశ్మీర్ ను ప్రేమిస్తారు అని ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు.

బెంగాల్ లోని బెహాలాలో నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో సువెందు అధికారి తాజాగా సీఎం మమతా బెనర్జీ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. శ్యామ్ ప్రకాస్ ముఖర్జీ వల్లే భారత్ ఇస్లామిక్ దేశం కాకుండా ఉందని.. లేకపోతే మనం బంగ్లాదేశ్ లో నివసిస్తుండేవాళ్లం అని ఆరోపించారు. మమత తిరిగి అధికారంలోకి వస్తే బెంగాల్ కూడా మరో కశ్మీర్ లా తయారవుతుందని సువెందు అధికారి వ్యాఖ్యానించారు.

కాగా మమతా బెనర్జీపై సువెందు అధికారి నందిగ్రామ్ నియోజకవర్గంలో పోటీచేచేస్తున్నారు. ఆమెను ఓడిస్తానని సవాల్ చేశారు. మొత్తం 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీకి 8 విడతల్లో పోలింగ్ జరుగబోతోంది. మే 2న ఫలితాలు వెలువడనున్నాయి.