Begin typing your search above and press return to search.
ఒమర్ సయీద్ నిర్ధోషి.. పాక్ సుప్రీం సంచలన తీర్పు.. రెండ్రోజుల్లో విడుదల
By: Tupaki Desk | 28 Jan 2021 2:30 PM GMTటెర్రరిస్టుల ఉత్పత్తి కేంద్రంగా పేరుగాంచిన పాకిస్తాన్‌లో.. ప్రభుత్వం, కోర్టులే ఉగ్రవాదులకు వత్తాసు పలుకుతున్నారనే విమర్శలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. అయినప్పటికీ.. విధానాలు మాత్రం మారడంలేదు. తాజాగా.. పాక్ అత్యున్నత న్యాయస్థానం మరో కరడుగట్టిన ఉగ్రవాదిని రిలీజ్ చేసింది. భారత్ కు కూడా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుగా ఉన్న ఒమర్ సయీద్ షేక్ జైలు నుంచి విడుదల కాబోతున్నాడు.
విఖ్యాత మీడియా సంస్థ వాల్ స్ట్రీట్ జనరల్ కు దక్షిణాసియా బ్యూరో చీఫ్ గా వ్యవహరించిన అమెరికా జర్నలిస్టు డానియెల్ పెర్ల్ కిడ్నాప్, హత్య కేసులో ఒమర్ సయీద్ సహా మరో ముగ్గురు టెర్రరిస్టులు కీలక నిందితులు. అయితే.. వారిని తక్షణమే విడుదల చేయాలని పాక్ సుప్రీంకోర్టు గురువారం ఆదేశాలిచ్చింది. జర్నలిస్టు హత్య కేసులో సయీద్ సహా ముగ్గురికి విధించిన మరణశిక్షను సింధ్ హైకోర్టు రద్దు చేయగా.. దానిని సవాలు చేస్తూ ఇమ్రాన్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కానీ.. అక్కడ కూడా ఇదే నిర్ణయం వెలువడింది.
బ్రిటిష్-పాకిస్తానీ జాతీయుడైన ఒమర్ సయీద్.. 1999లో ఇండియా విమానం హైజాక్ ఘటనతో వెలుగులోకి వచ్చాడు. అప్పట్లో విమానాన్ని హైజాక్ చేసిన తాలిబన్లు.. భారత్ నుంచి విడిపించుకొని వెళ్లిన టెర్రరిస్టుల్లో ఒమర్ సయీద్ కూడా ఒకడు. ఇతని ఆధ్వర్యంలోని ఉగ్రవాదులు.. 2002లో వాల్ స్ట్రీట్ జర్నలిస్టు డానియెల్ పెర్ల్ ను కిడ్నాప్ చేసి, దారుణంగా గొంతు కోసి హత్య చేశారు. ఈ ఘటనను అమెరికా ప్రభుత్వం తీవ్రంగా పరిగణించడంతో సయీద్ గ్యాంగ్ ను పాక్ పోలీసులు లాహోర్ లో అరెస్టు చేశారు. కరాచీలోని యాంటీ టెర్రరిస్టు కోర్టు వీరికి మరణశిక్షలు విధించింది. అయితే, తాము నిర్దోషులమంటూ సయీద్ సహా మరో ముగ్గురు సింధ్ హైకోర్టును ఆశ్రయించారు.
18 ఏళ్ల సుదీర్ఘ వాదనల తర్వాత.. డానియెల్ పెర్ల్ హత్య కేసులో ఒమర్ సయీద్ పాత్ర అతి కొద్ది శాతమేనని, అతని టీమ్ సభ్యులుగా పేరున్న ఫాహద్ నసీం, షేక్ ఆదిల్, సల్మాన్ సాఖిబ్ లు పూర్తిగా నిర్దోషులని పేర్కొంటూ సింధ్ హైకోర్టు గతేడాది ఏప్రిల్ లో తీర్పు చెప్పింది. ఒమర్ సయీద్ ను సుదీర్ఘ కాలం జైలులో ఉంచడం చట్టవిరుద్దమని వ్యాఖ్యానించిన హైకోర్టు.. జర్నలిస్టు హత్య కేసులో అతనికి విధించాల్సిన 7ఏళ్ల జైలు శిక్ష ఎప్పుడో పూర్తయిపోయిందని చెప్పింది. అందువల్ల వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది.
ఈ తీర్పుపై ఇమ్రాన్ ఖాన్ సర్కారు అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. సుప్రీంకోర్టును ఆశ్రయిచింది. అయితే.. 10 నెలల విచారణ అనంతరం పాక్ సుప్రీంకోర్టు కూడా వారు నిర్దోషులేనని, విడుదల చేయాలని తీర్పు చెప్పిది. గురువారం గడువు ముగియడం, శుక్రవారం జాతీయ సెలవు దినం కావడంతో టెర్రరిస్టు ఒమర్ సయీద్, అతని అనుచరులు ముగ్గురు శనివారం జైలు నుంచి విడుదల కాబోతున్నారు.