Begin typing your search above and press return to search.

తెలంగాణలో విస్తరిస్తోన్న ఒమిక్రాన్ ‘బిఎ2’ ..?

By:  Tupaki Desk   |   18 Jan 2022 4:43 AM GMT
తెలంగాణలో విస్తరిస్తోన్న ఒమిక్రాన్ ‘బిఎ2’ ..?
X
తెలంగాణ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య అంచనాలకు అందని విధంగా పెరుగుతున్నాయి. మొదటి, సెకండ్ వేవ్ కంటే ఈసారి కేసులు ఉధృతంగా నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే 2447 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 22 వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. అయితే ఇప్పుడు నమోదవుతున్న కేసుల్లో ఎక్కువగా ఒమిక్రాన్ వేరియంట్ వే నని వైద్యులు తెలుపుతున్నారు. మొత్తం కేసుల్లో 92 శాతం ఒమిక్రాన్ వేరియంట్ వే నని అంటున్నారు. ఈనెల మొదటి వారంలో జీహెచ్ఎంసీ పరిధిలో 90 నమూనాలను పరిశీలించగా వాటిలో 83 పాజిటివ్ కేసులు ఒమిక్రాన్ వేరియంట్ వని గుర్తించారు. మరోవైపు రాష్ట్రంలో గత 5 రోజులుగా కేసులు రెట్టింపుగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

అయితే ఒమిక్రాన్ లోనూ ‘బిఎ1’కు చెందినవి 15, ‘బిఎ2’కు చెందినవి 64, ‘బి.1.1.529’కు చెందినవి 4 గా గుర్తించారు. దీంతో రాష్ట్రంలో ఎక్కువగా ‘బిఎ2’ వ్యాప్తి ఎక్కువగా ఉందని వైద్యులు తెలుపుతున్నారు. ఇప్పటికే చాలా మంది ఒమిక్రాన్ బారిన పడ్డారు. ఒమిక్రాన్ సోకిన వారికి చికిత్స చేసిన వైద్యులు కొవిడ్ సోకింది. అయితే వారా శాంపిల్స్ ను పరీక్షించేందుకు పూణెకు పంపించారు. ఇప్పటి వరకు గాంధీ ఆసుపత్రిలో 40 మంది పీజీ విద్యార్థులు , ఉస్మానియాలో 71 మంది విద్యార్థులతో పాటు వైద్య సిబ్బంది, నిమ్స్ లో 90 మంది వైద్య సిబ్బందికి కరోనా సోకింది. వీరందరికి 7 రోజుల క్వారంటైన్ గా నిర్దారించారు.

కరోనా కేసులు రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈనెల ప్రారంభంలో 500 నుంచి నేటి వరకు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా 2447 కేసులు నమోదయ్యాయి. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో 22,197 యాక్టివ్ కేసులుఉన్నాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 7,11,656 కు పెరిగింది. ఇక తాజాగా ముగ్గురు చనిపోగా మొత్తం 4,060 మంది చనిపోయారు. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 1,112 పాజిటివ్ లు నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లోనూ వందల కొద్దీ కేసులు నమోదవుతున్నాయి. ఇక కోల్ బెల్ట్ ప్రాంతంలో కొవిడ్ వేగంగా విస్తరిస్తోంది. సోమవారం నాడు వెలువడిన ఫలితాల్లో మొత్తం 913 మంది కొవిడ్ తో బాధపడుతున్నట్లు సంస్థ డైరెక్టర్ బలరాం, చంద్రశేఖర్ తెలిపారు.

ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నాయకులు కొవిడ్ బారిన పడుతున్నారు. భద్రాద్రి జిల్లాల్లో 23 మంది కరోనా కోరల్లో చిక్కుకున్నారు. వీరిలో ఒక సీఐ, ఇద్దరు ఎస్ఐలు ఉన్నారు. అలాగే కాంగ్రెస్ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కరోనాతో బాధపడుతున్నారు. తాజాగా ఆయన జూబ్లి హిల్స్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ రాష్ట్ర చైర్మన్ మహేశ్వర్ రెడ్డికి కూడా పాజిటివ్ నిర్దారణ అయింది.