Begin typing your search above and press return to search.

టీమిండియా టూర్ ను వెంటాడుతున్న ఒమైక్రాన్

By:  Tupaki Desk   |   22 Dec 2021 11:30 AM GMT
టీమిండియా టూర్ ను వెంటాడుతున్న ఒమైక్రాన్
X
ముహూర్త వేళా విశేషమో ఏమోకానీ.. టీమిండియా.. దక్షిణాఫ్రికా టూర్ పై ఒమిక్రాన్ వేరియంట్ కత్తి వేలాడుతోంది. ఇప్పటికే సిరీస్ లో టి20 మ్యాచ్ లు రద్దయ్యాయి. టెస్టు మ్యాచ్ ల షెడ్యూల్ వారం వెనక్కు జరిగింది. అయితే, ఈ లోగా టీమిండియా వన్డే కెప్టెన్సీ పై దుమారం రేగింది. రోహిత్ శర్మ వంటి కీలక ఆటగాళ్లు దూరమయ్యారు. వివాదం అది సద్దుమణిగిందని అనుకుంటుండగా.. ఒమిక్రాన్ ప్రపంచమంతటికీ పాకింది.

అమెరికానే అతలాకుతలం అవుతోంది. దక్షిణాఫ్రికాలో కేసుల 25 వేల వరకు వస్తున్నాయి. ఇటు భారత్ లోనూ ఒమైక్రాన్ కలకలం పెరుగుతోంది. ఇప్పటికే టీమిండియా దక్షిణాఫ్రికా చేరింది. సాధన కూడా మొదలుపెట్టింది. తొలి టెస్టుకు మరో మూడు రోజులే ఉంది. కాగా, వేరియంట్ భయాందోళనలు మాత్రం వీడడం లేదు.

తాజాగా ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తే భారత ఆటగాళ్లను స్వదేశానికి పంపిస్తామని క్రికెట్ సౌత్ ఆఫ్రికా (సీఎస్ఏ) తెలిపింది. సిరీస్‌ కోసం సీఎస్‌ఏ గట్టి ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం అక్కడ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రేక్షకులు లేకుండానే టెస్టు సిరీస్‌ను నిర్వహిస్తామని ప్రకటించింది. మరోవైపు, ముందు జాగ్రత్త చర్యగా ప్రత్యేకంగా ఓ ఆస్పత్రిలో బెడ్లను కూడా సిద్ధం చేసింది.

‘భారత ఆటగాళ్లకు ఇప్పటికే కరోనా బూస్టర్‌ డోసులు అందించాం. ఏ కారణంగానైనా ఆటగాళ్లు అనారోగ్యం పాలైతే తక్షణమే వైద్య సహాయం అందించేందుకు ఓ ఆస్పత్రిలో బెడ్లను ఏర్పాటు చేశాం. ఒకవేళ మ్యాచ్‌ జరుగనున్న వేదికల్లో ఒమిక్రాన్‌ వేరియంట్ విజృంభిస్తే ఆటగాళ్లను వెంటనే ఇండియాకు పంపిస్తామని దక్షిణాఫ్రికా ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ విషయంపై భారత ప్రభుత్వ స్పందన కోసం ఎదురు చూస్తున్నాం. ఒకవేళ ఆటగాళ్లు ఇక్కడే ఉంటామన్నా అందుకు తగ్గ సౌకర్యాలు కల్పిస్తాం.

తప్పనిసరి పరిస్థితుల్లో భారత్ వెళ్లాలనుకున్నా అందుకు అనుమతిస్తాం’ అని సీఎస్‌ఏ చీఫ్‌ మెడికల్ ఆఫీసర్‌ డాక్టర్ షుయబ్ మంజ్రా పేర్కొన్నారు. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ ముగిసిన తర్వాత టీమ్‌ఇండియా డిసెంబరు 16న ప్రత్యేక ఛార్టర్డ్‌ ఫ్లైట్‌లో దక్షిణాఫ్రికా చేరుకుంది. అక్కడ సీఎస్ఏ కేటాయించిన హోటల్‌లోనే భారత ఆటగాళ్లు బస చేస్తున్నారు. ప్రాక్టీస్ సెషన్‌ కోసం గ్రౌండ్‌కి వెళ్లి.. మళ్లీ నేరుగా హోటల్‌కే వస్తున్నారు. సెంచూరియన్‌లో తొలి రెండు టెస్టులు ముగిశాక.. జనవరి 11 నుంచి ప్రారంభం కానున్నమూడో టెస్టు కోసం ఆటగాళ్లంతా ఛార్టర్డ్‌ ఫ్లైట్‌లో కేప్‌ టౌన్‌ బయలు దేరనున్నారు.