Begin typing your search above and press return to search.
కేంద్రం హై అలర్ట్.. డెల్టా కన్న మూడు రెట్లు వేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి!
By: Tupaki Desk | 22 Dec 2021 1:19 AM GMTఒమిక్రాన్ ప్రస్తుతం అన్నీ దేశాలను గడగడలాడిస్తోంది. ఒకటి కాదు రెండు కాదు, వేల సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ కొత్త వేరియంట్ దాటికి యూకేలో పది వేలకు పైగా కొత్త కేసులు నిర్ధరణ అయ్యాయి. మరో వైపు అమెరికాలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇటీవల జరిపిన పరీక్షల్లో కరోనకు సంబంధించి కొత్త వేరియంట్ అయిన ఒమిక్రాన్ ఆ దేశంలో నమోదు అయిన కేసుల్లో సుమారు 73 శాతం కొత్త వేరియంట్వి అని తెలియడం ఆందోళనకు గురి చేస్తోంది. దీనికి గల ప్రధాన కారణం ఈ వేరియంట్ వ్యాప్తి ఎక్కువగా ఉండడమే.
ఇదిలా ఉంటే కొత్త వేరియంట్ వ్యాప్తి, లక్షణాలు, తీవ్రత ఇలా చాలా ఇతర అంశాలపై ఒక్కొక్క పరిశోధన ఒక్కొక్కలా చెప్తుంది. కానీ బ్రిటన్ లో వెలుగు చూసిన కేసులను చూస్తే.. ఒమిక్రాన్ కు కొద్ది రోజుల్లోనే కేసుల సంఖ్యను రెట్టింపు చేసే గుణాన్ని కలిగి ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఒమిక్రాన్ భారత్ లోకి కూడా ప్రవేసించింది.
కాని పెద్ద సంఖ్యలో కేసులు రాకపోవడం చాలా శుభపరిణామం. ఎందుకంటే ఒమిక్రాన్ వ్యాప్తిలో కేసులు అంతకంతకూ పెరుగుతూ పోతుంటాయి. కానీ ఇది అలా లేదు. కాని కేసులు మాత్రం నిర్ధరణ అవుతున్నాయి. కానీ ఇప్పటికే కలవర పెడుతున్న ఒమిక్రాన్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డెల్టా కంటే ఈ కొత్త వేరియంట్ వ్యాప్తి ఒకటికి మూడు రెట్లు ఎక్కవుగా ఉంటుందని తెలియడంతో అలర్ట్ అయ్యింది.
గతంలో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ఎలా అయితే చర్యలు తీసుకుందో అలాంటి చర్యలనే చేపట్టాలని దేశంలోని వివిధ రాష్ట్రాలకు సూచించింది. మరో వైపు క్షేత్రస్థాయిలో పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థను తయారు చేయాలని భావిస్తుంది. వీటితో పాటు టెస్టుల సంఖ్యను కూడా భారీగా పెంచాలని నిర్ణయించింది.
ఇందుకు సంబంధించిన ప్రతిదీ వార్ రూమ్ లు ఏర్పాటు చేసి చర్చించాని రాష్ట్రాలకు వివరించింది. వీటితో పాటు వైరస్ ను ఎదుర్కొనేందుకు ప్రధాన అస్త్రం అయిన టీకా పంపిణీని కూడ మరింత వేగవంతం చేయాలని నిర్ణయించింది.
ఇదిలా ఉంటే కొత్తగా నమోదు అవుతున్న కేసుల్లో అసలు వైరస్ లక్షణాలు కనిపించడం లేనది పరిశోధకుల చెప్తున్నారు.
దీంతో మరింత ప్రమాదమని భావిస్తున్నారు. వైరస్ లక్షణాలు కనిపించకపోతే వ్యాప్తి మరింత ఎక్కువగా ఉంటుంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్పిన దాని ప్రకారం దేశంలో నమోదు అయ్యే కేసుల్లో 80 శాతం కేసుల్లో లక్షణాలు లేవని స్పష్టం చేశారు.