Begin typing your search above and press return to search.

దిల్లీలో ఒమిక్రాన్ మ్యూటెండ్ కలకలం.. కొత్త కేసులకు కారణమేంటి?

By:  Tupaki Desk   |   22 April 2022 3:29 AM GMT
దిల్లీలో ఒమిక్రాన్ మ్యూటెండ్ కలకలం.. కొత్త కేసులకు కారణమేంటి?
X
దేశంలో కరోనా తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. ఇప్పటికే ప్రపంచంలోని చాలా దేశాలను వణికించిన ఈ మహమ్మారి మరోసారి మన దేశంపై పంజా విసిరే అవకాశం కనిపిస్తోంది. అయితే తాజాగా దేశ రాజధాని దిల్లీలో భారీ స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా కేసుల సంఖ్య పెరుగుదలకు ఒమిక్రాన్ మ్యూటెంట్ వేరియంట్ కారణమని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ ఒమిక్రాన్ మ్యూటెంట్ మరో కొత్త వేరియంట్ గా రూపాంతరం చెందినట్లు సైంటిస్టులు భావిస్తున్నారు.

దిల్లీలో కరోనా బారిన పడిన బాధితుల నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షించగా... వారిలో ఒమిక్రాన్ కొత్త బీఏ2.12.1 మ్యూటెంట్ వేరియంట్ ఉందని నిర్ధారణ అయినట్లు ఓ నివేదిక వెల్లడించింది. ఇది ఒమిక్రాన్ వేరియంట్ బీఏ2 కు సంబంధించిన SARS COV 2 కొత్త మ్యూటెంట్ వేరియంట్ గా గుర్తించారు. ప్రస్తుతం దిల్లీ చుట్టుపక్కల జిల్లాలో కరోనా కేసుల పెరుగుదలకు ఈ కొత్త మ్యూటెంట్ వేరియంట్ ప్రధాన కారణమని భారత కరోనా వైరస్ జెనోమిక్ సర్త్వైలెన్స్ ప్రాజెక్ట్ INSACOG వర్గాలు తెలిపాయి.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని NCDC డైరెక్టర్ సుజిత్ కుమార్ సింగ్ దిల్లీలో ఒమిక్రాన్ బీఏ2.12.1 వేరియంట్ ను గుర్తించినట్లు ధృవీకరించారు. ఈయన INSACOG ప్రాజెక్టుకు నేతృత్వం వహిస్తున్నారు. అయితే ఈ వేరియంట్ కు సంబంధించి పూర్తి వివరాలను గురించి ఇంకా పూర్తిగా వెల్లడించలేదు. అలాగే గత కొంత కాలంగా ఈ వేరియంట్ బారిన పడిన అనేక మంది బాధితుల నమూనాలను పరీక్షిస్తున్నారు.

కొత్త వేరియంట్ ఉన్న వారిలో ఎక్కువ మందిలో BA.2.12.1 వేరియంట్ గుర్తించినట్లు అధికారులు తెలిపారు. కొవిడ్ న్యూ వేరియంట్లలో BA.2.12.1, BA.2.12తో పాటు ఒమిక్రాన్ BA.2 సబ్ వేరియంట్ కేసులను న్యూయార్కత్ లోని US సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్-CDC ఇప్పటికే అమెరికాలోని కొన్ని చోట్ల గుర్తించినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఈ వేరియంట్ క్రమంగా మ్యటేట్ చెంది మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని సైంటిస్టులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని కరోనా బాధితుల నుంచి సేకరించిన శాంపిల్స్ BA.2.12.1 ఉందని నిర్ధారించినట్టు NCDCలోని అధికారులు చెబుతున్నారు.

భారతదేశంలో గుర్తించిన కొత్త సబ్ వేరియంట్ BA.2.12.1 ఎంత మేరకు ప్రమాదం అనే విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ-WHO అధికారికంగా ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు. గతంలో SARS CoV సోకిన బాధితుల్లో తిరిగి సోకే సామర్థ్యాన్ని కలిగి ఉందని అన్నారు.