Begin typing your search above and press return to search.
ప్రపంచాన్ని వణికించేస్తున్న ఒమిక్రాన్
By: Tupaki Desk | 29 Nov 2021 6:31 AM GMTఎప్పటికప్పుడు కొత్త మ్యుటేషన్లతో కోవిడ్ వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని వణికించేస్తోంది. తాజాగా బయటపడిన ఒమిక్రాన్ మ్యుటేషన్ మొత్తం ప్రపంచాన్నే గడగడలాడించేస్తోంది. కరోనా వైరస్ ప్రభావం తగ్గిపోయిందని, కేసులు, మృతుల సంఖ్య బాగా తగ్గిపోయింది కాబట్టి ఇబ్బందేమీ లేదని ప్రపంచదేశాలు అనుకుంటున్న సమయంలో హఠాత్తుగా ఒమిక్రాన్ అనే మ్యుటేషన్ రూపంలో కరోనా బయటపడింది. దక్షిణాఫ్రికాలో బయటపడిన ఒమిక్రాన్ మ్యూటేషన్ ఇప్పటికే అనేక దేశాల్లో ప్రమాధఘంటికలను మోగిస్తోంది.
ఒమిక్రాన్ దెబ్బకు బ్రిటన్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, ఫ్రాన్స్, బెల్జియం, బ్రెజిల్, ఇజ్రాయెల్, హాంకాంగ్ దేశాలు వణికిపోతున్నాయి. దక్షిణాఫ్రికాలోని కొన్ని దేశాల్లో కూడా ఒమిక్రాన్ మ్యుటేషన్ చాలా స్పీడ్ గా వ్యాపిస్తోంది. అమెరికాలో ఇలాంటి కేసులు ఇంకా బయటపడలేదు కానీ అసలు లేనేలేదని అనేందుకు లేదని అక్కడి ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడ్డారు. ఎందుకంటే అనేక దేశాల నుండి ప్రతిరోజు అమెరికాకు లక్షల్లో వస్తుంటారు. వీరిలో ఎవరికి ఒమిక్రాన్ ఉంది ఎవరిలో లేదనే విషయాన్ని స్క్రీనింగ్ చేస్తే కానీ బయటపడదని నిపుణులు చెబుతున్నారు.
కరోనా వైరస్ మహమ్మారి కన్నా కనీసం 10 రెట్ల వేగంతో వ్యాపిస్తోందని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్ధ శాస్త్రజ్ఞులు ప్రకటించారు. దీని కారణంగానే చాలా దేశాలు విమాన రాకపోకలను నిషేధిస్తున్నాయి. పర్టిక్యులర్ గా దక్షిణాఫ్రికా నుండి విమాన రాకపోకలను నిషేధించటం సంచలనంగా మారింది. ఒమిక్రాన్ ను ఎదుర్కొనాలంటే మళ్ళీ జనాలు మాస్కులు ధరించటం, భౌతికదూరాన్ని పాటించటం, కోవిడ్ టీకాలను రెండు డోసులను వేసుకోవటంతో పాటు అవసరం లేకపోతే ఎవరిళ్ళల్లో వాళ్ళు కూర్చోవటం ఒకటే మార్గమని గట్టిగా చెబుతున్నారు.
కోవిడ్ టీకాలు వేసుకున్న వారికి కూడా ఒమిక్రాన్ సోకే ప్రమాధముంది కాబట్టి అందరు ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాల్సిందే అని ప్రపంచ ఆరోగ్య సంస్ధ ఇప్పటికే ప్రపంచదేశాలను అప్రమత్తం చేసింది. ఇదే పద్దతిలో ఆయా దేశాలు తమ ప్రజలను రెగ్యులర్ గా అలర్ట్ చేస్తోంది. మన విషయానికి వచ్చేసరికి కేంద్రప్రభుత్వం కూడా అన్నీ రాష్ట్రాలకు ప్రత్యేక గైడ్ లైన్స్ జారీచేసింది. భారత్ తో సహా దాదాపు 20 దేశాలు దక్షిణాఫ్రికా నుండి విమాన ప్రయాణాలను బ్యాన్ చేసేశాయి.
ఇదే విషయమై దక్షిణాఫ్రికా మెడికల్ అసోసియేషన్ మండిపోతోంది. ఒమిక్రాన్ మ్యూటేషన్ వెలుగుచూసిందని ప్రపంచాన్ని అప్రమత్తం చేసిన కారణంగానే తమ దేశంతో విమాన ప్రయాణాలను బ్యాన్ చేస్తున్నారా అంటు అసోసియేషన్ నిలదీసింది. వైద్య సమాచారాన్ని పదర్శకంగా తెలుసుకోవాలంటే ముందు నిషేధాన్ని ఎత్తేయాలని సూచించింది. తమ దేశంతో విమాన ప్రయాణాలపై విదేశాలు నిషేధం విధించటం ఎంతమాత్రం తగదంటు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తంచేసింది. ఒమిక్రాన్ వేరియంట్ పై అప్రమత్తం చేసిన తమనే ప్రపంచదేశాలు విలన్లుగా చూడటం ఏమిటంటు అసోసియేషన్ నిలదీసింది. అయితే ఇవేవీ పట్టించుకునే స్ధితిలో విదేశాలు లేవన్నది వాస్తవం.