Begin typing your search above and press return to search.
గాంధీలో ఒమిక్రాన్ 'లెక్క' తేల్చే పని మొదలైంది
By: Tupaki Desk | 16 Dec 2021 3:23 AM GMTమాటలు చెప్పింత సులువుగా పనులు పూర్తి కావు. అక్కడెక్కడో దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ వేరియంట్ వెలుగు చూసిందన్న మాట తెలిసినంతనే.. దాన్ని గుర్తించేందుకు అవసరమైన సరంజామాను సిద్ధం చేసుకోవాలి. కానీ.. అలాంటిదేమీ పెద్దగా జరిగింది లేదు. కరోనా వేళ.. సేకరించిన శాంపిళ్లను ఫూణెకు పంపటం.. అక్కడ పరీక్షలు జరిపి.. ఫలితాన్ని వెల్లడించేందుకు రోజుల తరబడి సమయం తీసుకోవటం ఎలానో.. ఇప్పుడు ఒమిక్రాన్ విషయంలోనూ అలాంటి పరిస్థితే ఉంది.
ఇలాంటి తిప్పలకు చెక్ చెప్పేందుకు.. కరోనాకు నోడల్ కేంద్రంగా నిలిచిన సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలోనే ఒమిక్రాన్ లెక్క తేల్చేందుకు వీలుగా పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఇందుకు ప్రభుత్వ అనుమతి లభించినా.. వైద్య పరీక్షలకు అవసరమైన రీ ఏజెంట్స్ మాత్రం రాలేదు.దీంతో వాటి కోసం వెయిట్ చేస్తున్నారు. గాంధీ ఆసుపత్రిలోని మైక్రో బయోలాజీ విభాగంలో జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షల్ని త్వరలోనే నిర్వహిస్తారని చెబుతున్నారు.
బాధితుల నుంచి సేకరించిన నమూనాల్ని రివర్స్ ట్రాన్స్ క్రిప్షన్ పాలిమర్స్ చైన్ రియాక్షన్ పరీక్ష చేసిన తర్వాత వైరస్ కణ నిర్మాణానికి సంబంధించిన ఆర్ఎన్ఏ.. డీఎన్ఏలతో పాటు యమినో యాసిడ్స్ సీక్వెన్స్ ను పరిశీలిస్తారు. కణ నిర్మాణంలో హెచ్చుతగ్గులు.. అదనపు కణాల నిర్మాణం.. వాటి ఆధారంగా మ్యూలేషన్ జరిగిన తీరుతో పాటు.. రూపాంతం చెందిన వైరస్ మరింత బలంగా ఉందా? బలహీనంగా ఉందా? అన్న విషయాల్ని సైతం నిర్దారిస్తారు.
ఇదంతా తేల్చాలంటే అందుకు అవసరమైన ద్రావకాలు గాంధీకి అందాల్సి ఉంది. అవి వచ్చిన వెంటనే.. పరీక్షల్ని నిర్వహిస్తారు. కరోనా మొదటి రోజుల్ని గుర్తు చేసుకుంటే.. కరోనా వచ్చిందన్న అనుమానాలు ఉన్న వారి నుంచి శాంపిళ్లను సేకరించి.. వాటి లెక్క తేల్చేందుకు ఫూణె ల్యాబ్ కు పంపటం తెలిసిందే. అనంతరం నమూనాలు భారీగా పెరిగిపోతున్న వేళ.. గాంధీలోనూ ల్యాబ్ ను ఏర్పాటు చేసుకోవటం తెలిసిందే. ఒమిక్రాన్ విషయంలోనూ గాంధీ ఈ దిశగా అడుగులు వేస్తోంది.
ప్రభుత్వం నుంచి అనుమతులురావటంతో.. జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షల ప్రారంభానికి అవసరమైన ద్రావణాల పంపిణీకి.. టెండర్లు పిలిచారు. ఆ ప్రాసెస్ పూర్తి అయ్యాక.. ద్రావణాలు అందుబాటులోకి వచ్చాక.. శాంపిళ్లను గాంధీలోనే విశ్లేషిస్తారు. కాకుంటే.. దీని కోసం ఇంతకాలం పట్టకుండా ఇప్పటికే ఆ దిశగా సిద్ధమై ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.