Begin typing your search above and press return to search.
బీ అలెర్టు భారత్.. ఒమిక్రాన్ భారీగా తాకేదెప్పుడో చెబుతున్నారు
By: Tupaki Desk | 21 Dec 2021 12:11 PM GMTకరోనా కథ పూర్తి కాలేదు. కొద్ది నెలల వరకు కరోనా.. దాని వేరియంట్ల మీద అవగాహన తక్కువగా ఉండేది. ఎప్పుడైతే డెల్టా వేరియంట్ సెకండ్ వేవ్ రూపంలో విరుచుకుపడటం.. ఆ సందర్భంగా చోటు చేసుకున్న దారుణ పరిస్థితుల దెబ్బకు.. కరోనా.. దాని తీవ్రతతో పాటు.. అదెంతటి విలయాన్ని క్రియేట్ చేస్తుందన్న విషయంపై క్లారిటీ వచ్చేసింది. డెల్టా వేరియంట్ దాడి తగ్గి.. మామూలు పరిస్థితులు నెలకొంటున్నాయన్న వేళ.. ఒమిక్రాన్ వేరియంట్ వ్యవహారం బయటకు వచ్చింది. దక్షిణాఫ్రికాలో మొదలైన ఈ వేరియంట్.. డెల్టా.. డెల్టా ప్లస్ వేరియంట్ కంటే వేగంగా విస్తరిస్తుందన్న హెచ్చరికల్ని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
దీనికి తగ్గట్లే.. దాని విస్తరణ అమితమైన వేగంతో సాగుతోంది. చూస్తుండగానే దాదాపు 90 దేశాల్లో ఒమిక్రాన్ తీవ్రత సాగుతోంది. అయితే.. దీని కారణంగా మరణాలు తక్కువగా ఉన్నాయన్న వాదనలు వినిపిస్తున్నప్పటికి.. పలు దేశాలు ఈ కొత్త వేరియంట్ కు వణికిపోతున్నారు. తీవ్ర అనారోగ్యానికి గురి చేసే ఈ కొత్త వేరియంట్ తీవ్రత భారత్ ను తాకే సమయం ఎప్పుడన్న విషయంపై తాజాగా ఒక లెక్కను నిపుణులు వివరిస్తున్నారు.
వారి అధ్యయనం ప్రకారం ఒమిక్రాన్ కేసుల సంఖ్య భారత్ లో గణనీయంగా పెరుగుతాయని.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మూడో వేవ్ తాకే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికి దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు 200 వరకు నమోదయ్యాయి. డెల్టా ప్లస్ కంటే కూడా ఒమిక్రాన్ వేరియంట్ 70 రెట్లు వేగంగా విస్తరిస్తుందని చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఒక నివేదికను యూనివర్సిటీ ఆఫ్ హాంగ్ కాంగ్ వెల్లడించింది.
ఈ వేరియంట్ మనిషి రోగ నిరోధక వ్యవస్థ మీద దాడి చేస్తుందని.. రానున్న కాలంలో మరిన్ని వేరియంట్లు పుట్టే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటివరకు ఒమిక్రాన్ కేసుల్లో గొంతు నొప్పి.. అలసట లాంటి తేలిక లక్షణాలే బయటకు వచ్చాయి. ఒకవేళ.. డెల్టా ప్లస్.. ఒమిక్రాన్ వేరియంట్లు మ్యూటేట్ అయితే మాత్రం చాలా కష్టమని.. దారుణమైన పరిస్థితులు ఎదురవుతాయన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటివరకు ఒమిక్రాన్ బారిన పడిన వారు.. ఇంట్లోనే కోలుకుంటున్నారు. అయినప్పటికీ.. దీని తీవ్రత గురించి అవగాహన ఉన్న వారు మాత్రం ఒమిక్రాన్ మాట వింటేనే.. పక్కనే బాంబు పడినంత ఆందోళనకు గురవుతున్నారు. సో.. మరో రెండు నెలల్లో దేశంలో ఒమిక్రాన్ తీవ్ర రూపం దాలుస్తుందన్న అంచనాల నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.