Begin typing your search above and press return to search.

రోడ్ల మీద రక్తం పారనీయొద్దు.. బక్రీద్ బలులపై ఆ ఇమాం సంచలన

By:  Tupaki Desk   |   10 Aug 2019 5:19 AM GMT
రోడ్ల మీద రక్తం పారనీయొద్దు.. బక్రీద్ బలులపై ఆ ఇమాం సంచలన
X
సంచలన ఆదేశాలు జారీ చేశారో ఇమాం. మరో రెండు రోజుల్లో రానున్న బక్రీద్ వేళ.. ముస్లింలు ఎలా వ్యవహరించాలో చెప్పిన వైనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. లక్నోకు చెందిన ఐష్ బాగ్ ఈద్గా ఇమాం మౌలానా ఖాలిద్ రషీద్ ఫారంగీ సంచలన ఆదేశాలు జారీ చేశారు. బక్రీద్ పండుగ వేళ నిర్వహించే ఖుర్బానీ (జంతుబలులు) సందర్భంగా ఫోటోలు తీయొద్దని ముస్లింలను కోరారు.

బక్రీద్ సందర్భంగా జంతువుల్ని బలులు ఇచ్చే సందర్భంగా ఫోటోలు తీయటం.. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం నిషేధమని వెల్లడించారు. ముస్లింలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. బక్రీద్ వేళ.. రోడ్డు పక్కన జంతువుల్ని వధించొద్దని కోరిన ఆయన..రోడ్లపై రక్తం పారకుండా శుభ్రం పాటించాలన్నారు. జంతువుల వ్యర్థాలను చెత్తకుండీల్లో పారవేయాలని కోరారు.

ఇతర వర్గాలు పూజించే ఆవులను వధించి వారి మనోభావాల్ని దెబ్బ తీయటం ఇస్లాం అనుమతించదని స్పష్టం చేసిన మౌలానా.. బక్రీద్ ఖుర్బానీ వేళ ఫోటోలు ఎట్టి పరిస్థితుల్లో తీయొద్దని ఆదేశాలు జారీ చేయటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. అనవసరమైన ఉద్రిక్తతలకు అవకాశం ఇవ్వని రీతిలో ఈ తీరులో ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది.