Begin typing your search above and press return to search.
రాహుల్ అందానికి ఫిదా అయిన బామ్మ
By: Tupaki Desk | 26 Dec 2017 8:36 AM GMTకాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలవాలని 107 సంవత్సరాల బామ్మ ఒకరు కోరుకున్నారు. అది కూడా ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఆమె తన కోరికను వెల్లడించారు. అంతేకాదు... రాహుల్ గాంధీకి ఆమె బ్రహ్మాండమైన కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు. రాహుల్ చాలా అందగాడని, ఆయన్ను కలవాలనుకుంటున్నానని ఆమె తన మనసులోని కోరికను వెల్లడించారు. అందుకు రాహుల్ గాంధీ కూడా స్పందించారు.. ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ వివరాలన్నీ బామ్మగారి మనుమరాలు దీపాలి సికంద్ ట్విటర్లో వెల్లడించారు. రాహుల్ గాంధీకి ఆమె ట్విటర్ లో పోస్టు చేస్తూ ‘‘ఇవ్వాళ మా బామ్మగారి 107వ జన్మదినం. ఆమె రాహుల్ గాంధీని కలవాలనే కోరిక వెల్లడించారు. ఎందుకని అడిగితే.. రాహుల్ అందగాడే.. అని చెప్పారు” అంటూ పేర్కొన్నారు. అందులో భామ్మ ఫొటో కూడా పెట్టారు.
దీనిపై వెంటనే రాహుల్ స్పందించారు. ‘‘ప్రియమైన దీపాలీ… మీ అందమైన బామ్మగారికి జన్మదిన శుభాకాంక్షలు అందజేయండి. నా తరఫున ఆమెను కౌగలించుకోండి..శుభాకాంక్షలు” అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. అనంతరం దీపాలీ మరొక ట్వీట్ చేస్తూ రాహుల్ గాంధీ స్వయంగా ఫోన్ చేసి తన బామ్మగారికి శుభాకాంక్షలు తెలిపారని చెప్పారు. మొత్తానికి రాహుల్ అభిమానులను పెంచుకుంటున్నారన్నమాట.