Begin typing your search above and press return to search.
నాడు బాబు.. నేడు జగను.. అదే సమస్య...!
By: Tupaki Desk | 20 April 2022 5:30 AM GMTరాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గమనించిన వారు.. ముఖ్యంగా రాజకీయ నేతలు కూడా ఇదే మాట అంటున్నారు. నాడు చంద్రబాబు ఐదేళ్ల కాలంలో ఎలాంటి సమస్యను ఎదుర్కొన్నారో.. ఇప్పుడు .. ముఖ్యమంత్రిగా ఉన్న వైసీపీ అధినేత జగన్ కూడా అదే సమస్యను ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. ``పాలన బాగుంది.
కానీ, పనితీరే బాగోలేదు!`` అని ఆనాడు చంద్రబాబు పాలనపై ప్రజలు నెత్తీ నోరూ కొట్టుకున్నారు. కానీ, చంద్రబాబు చెవికి ఈ మాట చేరకుండా.. మధ్యలో ఉన్న నాయకులు.. కొందరు మంత్రులు కూడా.. అడ్డుకట్ట వేశారు. ఫలితంగా.. చంద్రబాబు ఆల్ ఈజ్ వెల్.. అంటూ.ప్రకటనలు గుప్పించారు.
మా ప్రభుత్వానికి ప్రజల నుంచి అంత అనుకూలత ఉంది.. ఇంత అనుకూలత ఉందని.. చెప్పుకొనే వారు. అంతేకాదు.. ఎవరైనా.. మీడియా మిత్రులు ఏదైనా చెప్పేందుకు సాహసిస్తే.. మీకు ఏం తెలీదు.. అని వ్యాఖ్యానించిన సందర్భాలు కూడా ఉన్నాయి.
తీరా ఎన్నికలకు ముందు.. రాష్ట్రంలో చేతులు ఎత్తేసే పరిస్థితి రావడం.. అప్పటికే ఎమ్మెల్యేలపైనా.. అధికారులపైనా.. ప్రజలు కోపం పెంచుకోవడంతో చంద్రబాబు పరిస్థితి దారుణంగా తయారైంది. కట్ చేస్తే.. ఇప్పుడు సేమ్ టు సేమ్ పరిస్థితి జగన్ విషయంలోనూ కనిపిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. ఆయన ఎన్నికలు అయిన.. తర్వాత తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రాలేదు.
గత రెండేళ్లలో అంటే.. కరోనా ఉంది. ఇప్పుడు అది లేదుకదా. కనీసం.. ఇప్పుడైనా క్షేత్రస్తాయిలో పర్యటించి.. సమస్యలు తీసుకు నేందుకు ప్రయత్నించవచ్చు కదా! అనే మాట వినిపిస్తే.. ఆయన ఖస్సున లేస్తున్నారని.. ఒకరిద్దరు చెబుతున్నారు. రాష్ట్రంలో అసలు సమస్యలే లేవన్నట్టుగా.. జగన్ భావిస్తున్నారు. ఇది ముమ్మాటికీ వాస్తవం.
ఎందుకంటే.. నెలనెలా వేల కోట్ల రూపాయ లను సంక్షేమానికి ఖర్చు చేస్తున్నాం కనుక.. ఇక. ప్రజలకు ఎలాంటి సమస్యలు లేవని .. ఆయన భావించి ఉండొచ్చు. కానీక్షేత్ర స్తాయికి వస్తే.. కదా.. సమస్యలు ఎలా ఉన్నాయో.. తెలిసేది అని పలువరు వ్యాఖ్యానిస్తున్నారు.
తాజాగా గుంటూరులో కౌలు రైతు ఆంజనేయులు మృతి చెందిన ఘటన తర్వాత.. ప్రభుత్వ యంత్రాంగం ఎంద నిద్రావస్థలో ఉందో అర్ధమవుతోందని.. పలువరు వ్యాఖ్యానిస్తున్నారు. రైతులకు ప్రభుత్వం ఎన్నో చేస్తోంది. కానీ, క్షేత్రస్థాయిలో అధికారులపై పట్టులేకపోవడంతో .. చిన్న చిన్న సమస్యల కారణంగా.. ప్రభుత్వం ఇబ్బందులు పడుతోంది. గతంలో చంద్రబాబు కూడా ఇలానే బాధలు పడ్డారు. లంచాలు లేవంటారు. కానీ, ఆంజనేయులు ఆధారాలతో కూడా చూపించారు. ఇలాం టి పరిణామాలు అనేకం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇప్పటికైనా.. జగన్ స్పందించి.. క్షేత్రస్థాయిలో తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నం చేయకపోతే.. ఇబ్బందులు తప్పవని అంటున్నారు