Begin typing your search above and press return to search.
గాంధీ పుట్టిన రోజే... గాడ్సే విగ్రహావిష్కరణ!
By: Tupaki Desk | 3 Oct 2016 7:27 AM GMTజాతిపిత మహాత్మగాంధీ జన్మదినం సందర్భంగా విస్మయకర సంఘటన జరిగింది. గాంధీ జయంతి పురస్కరించుకొని ఓ పక్క దేశమంతా గాంధీమహాత్ముని సేవలను కొనియాడుతూ ఆయనను స్మరించుకుంటుంటే మరోపక్క అఖిల భారతీయ హిందూ మహాసభ నాయకులు గాంధీని కాల్చిచంపిన గాడ్సేను కీర్తించారు. ఏకంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించి కలకలం సృష్టించారు. పైగా దేశప్రజలందరూ గాడ్సేను ఆదర్శంగా తీసుకోవాలని హితవు చెప్పారు!
యూపీలోని మీరట్ లో గాడ్సే విగ్రహ ఏర్పాటు కోసం హిందూసభ నాయకులు 2014లోనే శంకుస్థాపన చేశారు. కానీ పోలీసులు - వివిద ప్రజాసంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో అది అక్కడితోనే ఆగిపోయింది. కాగా గాంధీ జయంతి నాడే గాడ్సే విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అఖిల భారతీయ హిందూ మహాసభ జాతీయ ఉపాధ్యక్షుడు పండిట్ అశోక్‌శర్మ మాట్లాడారు. దేశ ప్రజలందరూ గాంధీని కాదని గాడ్సేను ప్రార్థించడం మొదలుపెట్టాలన్నారు. ఇటీవల జరిగిన 'సర్జికల్ స్ట్రైక్' కూడా గాడ్సే భావాలకు అనుగుణంగా జరిగిందని వ్యాఖ్యానించారు. అలాంటప్పుడు గాంధీజీ చెప్పిన శాంతిసూత్రాలను దేశ ప్రజలు ఎందుకు పాటించాలని శర్మ ప్రశ్నించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/