Begin typing your search above and press return to search.
రద్దుతో జనాలకు సినిమానేనని మోడీకి తెలుసట
By: Tupaki Desk | 19 Dec 2016 7:30 PM GMTపెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం.. సామాన్యులకు సినిమా కష్టాల్ని తీసుకొచ్చిందని చెప్పక తప్పదు. దాదాపు ఆరు వారాల కిందట నవంబరు 8 తేదీ రాత్రి వేళలో హటాత్తుగా టీవీ స్క్రీన్ మీదకు వచ్చేసిన ఆయన.. పెద్దనోట్లను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించి భారీ షాక్ ఇచ్చారు. ఆ షాక్ తీవ్రత ఎంతలా ఉంటుందన్న విషయం రోజులు గడిచే కొద్దీ ప్రజలకు అర్థమయ్యే పరిస్థితి.
మోడీ రద్దు నిర్ణయం ప్రకటించిన వెంటనే.. నోట్ల కష్టాలు నాలుగైదు రోజులు.. మహా అయితే వారం.. పది రోజులకు మించి ఉండవని ఫీలైనోళ్లు చాలామందే ఉన్నారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించే సందర్భంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. రద్దు నిర్ణయం కారణంగా 50 రోజుల పాటు జనాలకు కష్టాలు ఉంటాయని చెప్పారు. అయితే.. ఆయన మాటను ప్రజలు పెద్దగా పట్టించుకున్నది లేదు.
కానీ.. మోడీ చెప్పిన మాటల్లో ఎంత నిజం ఉందన్న విషయం రోజులు గడుస్తున్న కొద్దీ ప్రజలకు అర్థమవుతోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తాను తీసుకున్న రద్దు నిర్ణయం కారణంగా జనాలకు సినిమా కనిపించటం ఖాయమన్న విషయంపై ప్రధాని మోడీకి చాలా చక్కగా క్లారిటీ ఉందన్న వాస్తవం ఒకటి బయటకు వచ్చింది. పెద్దనోట్లను రద్దు చేసే సమయానికి.. కొత్తగా ముద్రించిన రూ.2వేల నోట్లకు సంబంధించిన ఆర్ బీఐ వద్ద ఉన్న మొత్తం ఎంతన్నది తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే.
ప్రధాని ప్రకటనతో రద్దు చేసిన నోట్ల విలువ రూ.20లక్షల కోట్లు అయితే.. భారతీయ రిజర్వ్ బ్యాంకు వద్ద ఉన్న రూ.2వేల నోట్ల విలువ కేవలం రూ.4.94 లక్షల కోట్లు మాత్రమేనట. అంటే.. రద్దు చేసిన నోట్లల్లో కేవలం పాతిక శాతం మాత్రమే ఆర్ బీఐ వద్ద ఉన్న చేదు నిజం తాజాగా సమాచార హక్కు చట్టం ఆధారంగా దాఖలు చేసిన ఒక పిటీషన్ తో బయటకు వచ్చింది. ముంబయికి చెందిన అనిల్ గాల్గాలి చేసిన దరఖాస్తుకు ఆర్ బీఐ బదులిచ్చింది. దీని ప్రకారం.. రూ.9.13 లక్షల కోట్ల విలువైన వెయ్యి నోట్లు.. రూ.11.38లక్షల కోట్ల విలువైన రూ.500 నోట్లు రద్దు అయినట్లుగా వెల్లడించింది. జనాలకు సినిమా కష్టాలు చూపించాలని డిసైడ్ అయ్యే.. రద్దు నిర్ణయాన్ని మోడీ ప్రకటించారనటానికి ఇంతకు మించిన సాక్ష్యం ఇంకేం ఉంటుంది. జనాలకు సినిమా చూపించాలని ప్రధానే డిసైడ్ అయ్యాక.. దేశ ప్రజలకు సినిమా కనిపించకుండా ఉంటుందా?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/