Begin typing your search above and press return to search.

ఆమె ధైర్యాన్ని మోడీ త‌ట్టుకోలేక‌పోతున్నారా?

By:  Tupaki Desk   |   4 May 2019 11:12 AM GMT
ఆమె ధైర్యాన్ని మోడీ త‌ట్టుకోలేక‌పోతున్నారా?
X
ప్ర‌చారం కోసం చీప్ ప‌బ్లిసిటీ చేసే నేత‌ల్ని నిత్యం చాలామందినే చూస్తుంటాం. ఇలాంటి నేత‌లు స‌మ‌కాలీన రాజ‌కీయాల్లో కుప్ప‌లు కుప్ప‌లుగా క‌నిపిస్తుంటారు. అయితే.. స్వాభావికంగానే ఉండే అల‌వాట్లు కొంద‌రు నేత‌ల‌కు ఉంటాయి. అలాంటి వాటిని అనుకోకుండా ప్ర‌ద‌ర్శించిన వేళ‌లో వారికి స‌రికొత్త ఇమేజ్ వ‌చ్చేస్తుంటుంది. అలా వ‌చ్చిన పేరును వ్యంగ్య వ్యాఖ్య‌లతో పంచ్ లు వేసే తీరు పాజిటివ్ కంటే నెగిటివ్ కే అవ‌కాశం ఉంటుంది.

మేనేజ్ మెంట్ గురు మాదిరి.. నిత్యం సూక్తులు చెప్పే మోడీ లాంటోళ్ల మాట‌ల‌కు చేత‌ల‌కు మ‌ధ్య తేడా గ‌డిచిన ఐదేళ్ల ఆయ‌న పాల‌న చెప్ప‌క‌నే చెప్పేసింది. అయితే.. ఇప్ప‌టికి ఆయ‌న్ను అభిమానించే వారు.. ఇష్ట‌ప‌డే వారు చాలామందే ఉంటారు. ఐదేళ్ల క్రితం ఆయ‌న మీద ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న వారిలో చాలామంది ఇప్పుడు ఆయ‌నంటేనే బెదిరిపోతున్న ప‌రిస్థితి.

స‌గ‌టు రాజ‌కీయ నేత‌లా ఆయ‌న తీరు ఉండ‌టం కొన్నిసార్లు విస్మ‌యానికి గురి చేసేదే. ఇందుకు కోల్ క‌తా ద‌గ్గ‌ర్లో ఏర్పాటు చేసిన ఎన్నిక‌ల ర్యాలీలో 40 మంది తృణ‌మూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ట‌చ్ లో ఉన్నార‌న్న కామెంట్ దీనికి నిద‌ర్శ‌నంగా చెప్పాలి. తాజాగా మోడీ త‌న తీరును మ‌రోసారి చెప్ప‌క‌నే చెప్పేశారు.

ఈ మ‌ధ్య‌న త‌న ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా పాములు ఆడించే వారి జీవ‌నాన్ని.. వారి క‌ష్టాల్ని తెలుసుకునే ప్ర‌య‌త్నం చేసిన ప్రియాంక‌.. వారి వ‌ద్ద ఉన్న పాముల్ని ప‌ట్టుకున్న తీరు..ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ఎలాంటి బెరుకు లేని ఆమె తీరుతో ఆమెకు స‌రికొత్త ఇమేజ్ వ‌చ్చింది. పాముల్ని ప‌ట్టుకునే క్ర‌మంలో.. జాగ్ర‌త్త అన్న కాంగ్రెస్ నేత‌ల మాట‌ల్ని ఆమె.. ఫ‌ర్లేద‌న్న మాట‌ను చెప్ప‌ట‌మేకాదు.. వాటిని డీల్ చేసిన విధానం ప‌లువురు అవాక్కు అయ్యేలా చేసింది.

పాముల్ని ప‌ట్టుకునే క్ర‌మంలో.. అదేదో ప్ర‌చారం కోసం అన్న‌ట్లు కాకుండా.. దాని ప‌ట్ల ఆమె ప్ర‌ద‌ర్శించిన శ్ర‌ద్ధ ప‌లువురి దృష్టిని ఆక‌ట్టుకునేలా చేసింది. పాములున్న‌బుట్ట‌ను ఆమె కింద బోర్లించి దుల‌ప‌టం.. ఆ త‌ర్వాత పామును చ‌క్క‌గా స‌ర్దిన వైనం చూస్తే.. అదేదో వీడియోల కోస‌మో.. ఫోటోల కోస‌మో కాకుండా.. వాటి ప‌ట్ల త‌న‌కున్న ప్రేమాభిమానాల్ని ప్ర‌ద‌ర్శించిన‌ట్లుగా క‌నిపించింది.

ఇలాంటి వాటితో ఆమెకొచ్చిన ఇమేజ్ ను మోడీ జీర్ణం చేసుకోలేక‌పోతున్నారో ఏమో కానీ.. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు వింటే అవాక్కు కావాల్సిందే. ప్రియాంక పేరును ప్ర‌స్తావించ‌కుండా.. చేసిన వ్యంగ్య వ్యాఖ్య వింటే.. ప్రియాంక పాము ఎపిసోడ్ ఆయ‌న‌లో ఏ మేర‌కు అసూయకు గురి చేసిందో అన్న భావ‌న క‌లుగ‌క మాన‌దు. పాములు కాదు.. మౌస్ లు ప‌ట్టుకోవాల‌ని మోడీ వ్యాఖ్య‌లు దీనికి నిద‌ర్శ‌నంగా చెబుతున్నారు. ఒక‌వేళ మోడీ మాట‌ల్నే తీసుకుంటే.. పాములు ప‌ట్టే వారి క‌ష్టాలు అక్క‌ర్లేదు.. మౌస్ లు ప‌ట్టే వారే త‌న‌కు అవ‌స‌ర‌మ‌ని చెప్ప‌ద‌లిచారా? ఒక‌వేళ‌.. అదే నిజ‌మైతే.. మౌస్ లు ప‌ట్టుకున్న వారికి మోడీ త‌న ఐదేళ్ల‌లో ఏమైనా చేశారా? అన్న‌ది చెప్ప‌గ‌ల‌రా? ఏదో ఒక విధంగా ఎట‌కారం చేసుకోవాల‌నే ఆలోచ‌న ప్ర‌ధానిస్థానంలో కూర్చున్న వారిలో లేకుంటే మంచిది. దుర‌దృష్ట‌వ‌శాత్తు మోడీ అలాంటి కోవ‌కు చెందిన నేత కాద‌న్న విష‌యం త‌న తాజా వ్యాఖ్య‌తో చెప్పేశార‌ని చెప్పాలి.