Begin typing your search above and press return to search.

మహా నిమజ్జన వేళ.. హైదరాబాద్ వాసులకు మెట్రో తీపికబురు

By:  Tupaki Desk   |   9 Sep 2022 4:55 AM GMT
మహా నిమజ్జన వేళ.. హైదరాబాద్ వాసులకు మెట్రో తీపికబురు
X
సందర్భానికి అనుగుణంగా స్పందించటం.. సానుకూలంగా నిర్ణయాలు తీసుకునే విషయంలో హైదరాబాద్ మెట్రో ముందు ఉంటుంది. ఆ విషయాన్ని తాజాగా మరోసారి నిరూపించింది. ఈ రోజు (శుక్రవారం) హైదరాబాద్ మహానగరంలో జరుగుతున్న మహా నిమజ్జనానికి సంబంధించి భారీగా ఏర్పాట్లు జరుగుతున్న సంగతి తెలిసిందే.

వినాయక నిమజ్జనంలో భాగంగా పెద్ద ఎత్తున విగ్రహాల ఊరేగింపు.. ట్రాఫిక్ ఆంక్షలు వెరసి.. వాహనాలతో ప్రయాణించటం ఇబ్బందులతో కూడుకున్నది.

ఇలాంటివేళ.. అలాంటి ఇబ్బందుల్ని అధగమించేందుకు వీలుగా మెట్రో ముందుకు వచ్చింది. మహా నిమజ్జనం సందర్భంగా ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి ఒంటి గంట వరకు మెట్రోసేవల్ని అందించనున్నట్లు చెబుతున్నారు.

చివరి రైలు ఒంటి గంటకు బయలుదేరి గమ్యస్థానానికి దగ్గరదగ్గర తెల్లవారుజామున రెండు గంటల సమయానికి చేరుకుంటుందన్న విషయాన్ని మెట్రో వెల్లడించింది.

గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో ట్రాఫిక్ అధికంగా ఉండే వేళలో.. సొంత వాహనాల్ని వాడే కన్నా.. మెట్రోలో ప్రయాణించటం సులువుగా ఉండటం ఖాయం. దీనికి తోడు ట్యాంక్ బండ్.. ఖైరతాబాద్ లాంటి చోట్లకు వెళ్లి గణనాధుల్ని దర్శించుకోవాలనుకునే వారికి మెట్రో సులువుగా ఉండనుంది.

శుక్రవారం అర్థరాత్రి రెండు గంటలవరకు సేవల్ని అందించే మెట్రో.. మళ్లీ శనివారం ఉదయం 6 గంటలకు యధావిధిగా తన సేవల్ని అందించనుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.