Begin typing your search above and press return to search.
ట్వీట్ తో తిట్టటం కాదు.. మనం చేసిందేంటి మేడమ్?
By: Tupaki Desk | 31 July 2019 11:40 AM GMTకొత్త తరహా రాజకీయం మొదలైంది. రాజకీయంగా ప్రత్యర్థుల విషయంలో ఎంతకైనా సరే వెనక్కి తగ్గేది లేదన్నట్లుగా వ్యవహరించటం పాత రాజకీయం. అలాంటి పాలిట్రిక్స్ కు తమదైన శైలిలో షాక్ ట్రీట్ మెంట్ ఇచ్చే మోడీషాల తీరుతో ఇప్పుడు నయా రాజకీయం తెర మీదకు వచ్చేసింది. సైద్ధాంతిక వైరుధ్యాల్ని అందరికి కనిపించే ఉంటూ.. చేయాల్సిన పనిని గుట్టుగా చేసేసే తీరు అంతకంతకూ పెరిగిపోతోంది. అందుకు నిలువెత్తు నిదర్శనంగా తాజాగా ట్రిపుల్ తలాక్ బిల్లు సందర్భంగా మైనార్టీ హక్కుల కోసం పోరాడతామని చెప్పే పీడీపీ అనుసరించిన వైఖరిని చెప్పొచ్చు.
ట్రిఫుల్ తలాక్ బిల్లును వివాదాస్పద బిల్లుగా అభివర్ణించే రాజకీయ పక్షాల్లో కశ్మీర్ కు చెందిన పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పొట్టిగా చెప్పాలంటే పీడీపీ) ముందు ఉంటుంది. అలాంటి పార్టీ తాను తీవ్రంగా వ్యతిరేకించే ట్రిపుల్ తలాక్ విషయంలో వ్యవహరించిన తీరు చూస్తే అవాక్కు అవ్వాల్సిందే. రాజ్యసభలో ఎన్డీయేకు ఉన్న బలాన్ని చూస్తే.. బిల్లు పాస్ కావటానికి అవసరమైన ఎనిమిది మంది సభ్యుల బలం తక్కువగా ఉన్న విషయం కనిపిస్తుంది. అలాంటి వేళ..బిల్లును ఎలా పాస్ చేయగలిగారంటే.. అదే మోడీ మాయగా చెప్పాలి.
బిల్లును వ్యతిరేకించే పక్షాలు తమ వాదనకు తగ్గట్లుగా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాల్సింది పోయి.. సభ నుంచి వాకౌట్ రూపంలోనో.. మరో రూపంలోనో బయటకు వెళ్లి.. ఓటింగ్ లో పాల్గొనకుండా ఉంటున్నారు. దీంతో సభలో ఉన్న సభ్యుల బలం చూసినప్పుడు ఎన్డీయే బలం ఎక్కువగా ఉండటం.. బిల్లుల్ని వ్యతిరేకించే వాళ్లు సభలో లేని కారణంగా.. బిల్లు పాస్ అయిపోతున్నాయి. తాజాగా. ట్రిపుల్ తలాక్ విషయంలోనూ జరిగిందిదే. పీడీపీనే కాదు.. బిల్లును వ్యతిరేకించే పలు పార్టీలు ఓటింగ్ సమయానికి సభలో లేకుండా వెళ్లిపోయాయి.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. చేసిన పనిని కవర్ చేయటానికి.. లేదంటే తమ ఓటు బ్యాంక్ ను కాపాడుకోవటానికి వేసే ఎత్తులు చూసినప్పుడే అసలు విషయం అర్థమయ్యే పరిస్థితి. ట్రిపుల్ తలాక్ బిల్లును వ్యతిరేకించి ఓటింగ్ లో పాల్గొనని పీడీపీ అధినేత ముఫ్తీ.. సోషల్ మీడియాలో మాత్రం భిన్నంగా స్పందించారు. ఇన్ స్టెంట్ తలాక్ చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు తేల్చిన తర్వాత కూడా దీనిపై చట్టం తీసుకురావాల్సిన అవసరం ఏముందో అర్థం కాలేదని పేర్కొన్నారు.
ఈ అనవసర జోక్యం ముస్లింలను శిక్షించటానికేనని.. ప్రస్తుతం దేశం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ట్రిపుల్ తలాక్ కు అంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందా? అని ప్రశ్నించారు. ట్వీట్ లో పంచ్ పడేటట్లు వ్యవహరించిన ముఫ్తీ మొహబూబా.. కీలకమైన ఓటింగ్ వేళ మాత్రం పత్తా లేకుండా పోయిన వైనం చూస్తే.. ట్వీట్లు ఏమో జనామోదానికి.. ఓటింగ్ దూరంగా ఉండటం ద్వారా మోడీ మాష్టారి ఆగ్రహానికి గురి కాకుండా ఉండటానికన్న వైనం ఇట్టే అర్థం కాక మానదు. నయా రాజకీయాన్ని నేర్పుతున్న మోడీ పుణ్యమా అని.. రానున్న రోజుల్లో దేశ రాజకీయాలు ఏ దిశగా అడుగులు వేస్తాయో చూడాలి.