Begin typing your search above and press return to search.
మునుగోడు భవితవ్యాన్ని తేల్చనున్న మంగళవారం రాత్రి
By: Tupaki Desk | 1 Nov 2022 8:41 AM GMTదేశంలోనే అత్యంత ఖరీదైన ఉప ఎన్నికగా పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకున్న మునుగోడు ఉప ఎన్నికలో కీలకమైన పోలింగ్ ఘట్టానికి కౌంట్ డౌన్ మొదలైంది. ఎన్నికల ప్రచారానికి ఈ రోజు సాయంత్రానికి తెర పడనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వందల కోట్ల ఖర్చు చేసిన రాజకీయ పార్టీలు.. పోలింగ్ కు కీలకమైన కొన్ని గంటల ముందు.. మరింత భారీగా ఖర్చు చేయటం ఖాయమంటున్నారు. దీంతో.. ఎవరి ప్లానింగ్ వారిది అన్నట్లుగా మారింది.
గెలుపు కోసం తపిస్తున్న రాజకీయ పార్టీలు ఈ రోజు (మంగళవారం) రాత్రిని కీలకంగా మార్చుకున్నాయి. తమ ఎన్నికల వ్యూహాలను అమలు చేసే పనిలో పడ్డాయి. ఇందుకోసం భారీ ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం ప్రచార గడువు ముగిసినంతనే.. నియోజకవర్గం పరిధిలో స్థానికేతరులు బయటకు వెళ్లనున్న సంగతి తెలిసిందే.
దీంతో.. స్థానికులను ఎవరు ప్రభావితం చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎన్నికల ప్రచారం ఎలా సాగినా.. పోలింగ్ కు ముందు ఉండే 24 గంటలు అత్యంత కీలకమైనవిగా చెబుతారు. చాలా ఎన్నికల ఫలితాలు పోలింగ్ కు ముందు ఉండే చివరి24 గంటల వ్యవధిలోనే డిసైడ్ అవుతుంటాయని చెబుతారు.
అందునా.. పోటాపోటీగా సాగుతున్న మునుగోడు లాంటి ఉప ఫోరుకు.. చివరి గంటలే కీలకమంటున్నారు. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల ప్రచారం.. నోట్ల పంపిణీ ఒక లెక్క అయితే.. చివరి గంటల్లో చోటు చేసుకునే పరిణామాలే.. గెలిచే పార్టీని నిర్ణయిస్తాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నిక భవితవ్యం మంగళవారం రాత్రి డిసైడ్ కానుందన్న మాట వినిపిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.