Begin typing your search above and press return to search.
ప్రేమికుల దినోత్సవం వేళ.. లవర్ చేతిలో మైనర్ బాలిక హతం
By: Tupaki Desk | 15 Feb 2022 1:56 AM GMTప్రేమికుల దినోత్సవాన్ని భారీగా సెలబ్రేట్ చేసుకోవటం కోసం ప్రేమికుడి మాటల్ని నమ్మిన ఒక మైనర్ బాలిక ప్రాణాలు విడిచింది. నమ్మి అతని కోసం వెళ్లిన ఆమె దారుణ హత్యకు గురైన షాకింగ్ ఉదంతం తాజాగా చోటు చేసుకుంది.
ఇందుకు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం హుగ్గెల్లి గ్రామ శివారు వేదికగా మారింది. ఆదివారం అర్థరాత్రి చోటు చేసుకున్న ఈ దారుణం గురించి సోమవారం బయటకు వచ్చింది.
హుగ్గెల్లి గ్రామ పొలిమేరలోని మామిడితోటలో 17 ఏళ్ల బాలిక డెడ్ బాడీ ఉందన్న విషయాన్ని గ్రామ సర్పంచ్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడకు వెళ్లారు.
మరణించిన బాలిక ఇంటర్ చదువుతున్నట్లుగా గుర్తించారు. బాలిక తల్లి పొదుపు సంఘం సమావేశానికి వెళ్లి రాత్రి వేళకు ఇంటికి వచ్చారు. అప్పటికే ఇంట్లో నుంచి వెళ్లిన బాలిక.. తల్లికి అనుమానం రాకుండా ఉండేలా.. మంచం మీద దిండ్లు పేర్చి.. దుప్పటికప్పి తాను నిద్రపోతున్న భావన కలిగేలా చేసింది. కుమార్తె పడుకున్న వైపు ఎలాంటి కదలిక లేకపోవటంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు దుప్పటి తీస్తే.. బాలిక స్థానంలో దిండ్లు పేర్చి ఉండటంతో.. ఆమె కోసం వెతకసాగారు.
ఇక.. ఘటనా స్థలంలో చూస్తే.. హత్య జరగటానికి ముందు అల్పాహారాన్ని తిన్నట్లుగా ఉంది. ఏకాంతంగా గడుపుదామని చెప్పి.. ఆమెను పిలిపించి ఉంటాడని.. బాలికపై లైంగిక దాడికి పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
తనపై దాడి జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెబుతుందన్న భయంతో చంపేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. బాలిక ఫోన్ ఆధారంగా.. హత్య చేసిన వాడు ఎవరై ఉంటారన్న విషయాన్ని గుర్తిస్తామని.. త్వరలోనే అరెస్టు చేస్తామని చెబుతున్నారు. ప్రేమికుల దినోత్సవం వేళ.. ప్రేమికుడి చేతిలో హతమైన బాలిక ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.