Begin typing your search above and press return to search.
ఇన్ఫోసిస్‌లో ముదురుతున్న వివాదం...సీఈఓ పై మరోసారి సంచలన ఆరోపణలు !
By: Tupaki Desk | 12 Nov 2019 5:56 AM GMTదేశీయ ఐటీ రంగంలో రెండో అతిపెద్ద సంస్థగా గుర్తింపు పొందిన ఇన్ఫోసిస్‌లో అనైతిక పద్ధతులు నడుస్తున్నాయా? సంస్థ ప్రయోజనాల కోసం తప్పుడు లెక్కలకు పాల్పడుతున్నారా? ఆదాయం, లాభాలు పెరిగేందుకు అడ్డదారులు తొక్కుతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సంస్థ సీఈవో సలీల్ పరేఖ్, సీఎఫ్‌వో నిలంజన్ రాయ్‌లు అనైతిక విధానాలను అవలంభిస్తున్నారని ఉద్యోగులే చెబుతున్నారు. సెప్టెంబర్ 20 న బోర్డుకు 2 పేజీల లేఖలో అనైతిక పద్ధతులపై ఆరోపణలు చేసారు. ఇంకా ఆ వివాదం సర్దు మనుగక ముందే తాజాగా మరో విజిల్ బ్లోయర్ సంచలన ఆరోపణలు చేశారు. అలాగే సీఈఓ సలీల్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఇన్ఫీ చైర్మన్ నందన్ నీలేకనితోపాటు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌కు ఒక లేఖ రాశారు.
సీఈవో పరేఖ్ కంపెనీలో చేరి ఇప్పటికే ఒక సంవత్సరం 8 నెలలు అయినప్పటికీ, ఇంకా ముంబై లోనే నివాసం ఉంటున్నారు. కంపెనీ రూల్స్ ప్రకారం సీఈఓ ముంబైలో కాకుండా బెంగళూరులో నివాసం ఉండాలన్న షరతును ఉల్లంఘించారని ఆరోపించారు. ఉద్యోగిగా, వాటాదారుగా, సంస్థ విలువ వ్యవస్థలను క్షీణింపజేస్తున్న పరేఖ్ గురించి కొన్ని వాస్తవాలను ఛైర్మన్, బోర్డు దృష్టికి తీసుకురావడం తన కర్తవ్యంగా భావిస్తున్నానని తెలిపారు. తక్షణమే స్పందించి, సంస్థ భవిష్యత్తు కనుగుణంగా చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే తనపై ప్రతీకారం తీర్చుకుంటారనే భయంతో తన గుర్తింపును వెల్లడించలేకపోతున్నానంటూ తన ఫిర్యాదులో తెలిపాడు.
పరేఖ్‌కు రెండు నెలల గడువు ఇచ్చినప్పటికీ కేవలం తన వ్యాపార ప్రయోజనాలకోసమే బెంగళూరుకు మకాం మార్చకుండా, ముంబైలోనే ఉంటున్నారని ఆరోపించారు. సీఈవోకు స్టాక్ మార్కెట్ కనెక్షన్లు ఉన్నాయని, అనేక సంస్థలలో పెట్టుబడులు పెట్టారని ఆరోపణలు చేసాడు. సీఈఓ పరేఖ్ తన పెట్టుబడుల పర్యవేక్షణ కోసమే ఇలా చేస్తున్నారన్నారు. సీఈవో నెలకు రెండు సార్లు ఆఫీస్‌కు వచ్చేందుకు విమాన చార్జీలు, ఇతర రవాణా చార్జీలకే సంస్థ రూ. 22 లక్షలు చెల్లించినట్టు తెలిపారు. నెలకు నాలుగు బిజినెస్ క్లాస్ విమాన టిక్కెట్లు, ఇంటి నుంచి ముంబై, బెంగళూరు విమానాశ్రయాలకి, ఆఫీసు నుంచి విమానాశ్రయం వరకు పికప్, డ్రాప్ చార్జీలు ఇందులో ఉన్నాయని విజిల్ బ్లోయర్ తెలిపాడు.ఈ ఆరోపణలపై ఇంకా ఇప్పటివరకు అటు సీఈఓ కానీ , ఇటు సంస్థ కానీ స్పందించలేదు.