Begin typing your search above and press return to search.

దురహంకారం: సిరాజ్ పై మరోసారి జాతివివక్ష వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   15 Jan 2021 1:52 PM GMT
దురహంకారం: సిరాజ్ పై మరోసారి జాతివివక్ష వ్యాఖ్యలు
X
ఆస్ట్రేలియా తెల్ల వాళ్ల వివక్ష మరోసారి బయటపడింది. నగరాలు, స్టేడియాలు మారినా ఆ అభిమానుల జాత్యంహకార వ్యాఖ్యలు ఆగడం లేదు. ఇప్పటికే సిడ్నీలో భారత క్రికెటర్లు సిరాజ్, బుమ్రాలపై అభిమానులు జాత్యంహకార వ్యాఖ్యలు కలకలం రేపాయి.

సిడ్నీ టెస్టులో రెండో రోజు.. మూడో రోజు ఆటలోనూ ఆటగాళ్లకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. సిరాజ్, బుమ్రాలను అభ్యంతరకర పదజాలంతో దూషించారు.దీనిపై కెప్టెన్ అజింక్య రహానే, రవిచంద్రన్ అశ్విన్ తదితర సీనియర్ ఆటగాళ్లు ఇద్దరు అంపైర్ల దృష్టికి తీసుకెళ్లారు.

ఇక టీమిండియా మేనేజ్ మెంట్ ఈ విషయాన్ని ఐసీసీకి ఫిర్యాదు చేసింది. ఐసీసీ దీన్ని తీవ్రంగా పరిగణించింది. దర్యాప్తునకు రెడీ అయ్యింది. వెంటనే సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించి అభిమానులకు బయటకు పంపింది.

తాజాగా 4వ టెస్టులోనూ అదే ఒరవడి నెలకొంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న బ్రిస్బేన్ టెస్టులోనూ జాతి వివక్ష వ్యాఖ్యలు కలకలం రేపాయి. బ్రిస్బేన్ లో ఆస్ట్రేలియా అభిమానులు రెచ్చిపోయారు. పేసర్ సిరాజ్, స్పిన్నర్ సుందర్ పై జాతి వివక్ష వ్యాఖ్యలు చేసినట్లు ప్రముఖ వార్తా సంస్థ ‘సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ వెల్లడించింది.

సిరాజ్ ను మురికి వ్యక్తి అని దూషించినట్టుగా తెలిపింది. సుందర్ పైనా అలాంటి వ్యాఖ్యలే చేసినట్లుగా ఆ వార్త సంస్థ తెలిపింది. దీంతో మరోసారి ఈ జాత్యంహకారం హాట్ టాపిక్ గా మారింది.