Begin typing your search above and press return to search.
కేసీఆర్ తో ఒకసారి చెడితే మళ్లీ అతకదా?
By: Tupaki Desk | 2 May 2021 8:30 AM GMTదేశం మొత్తం కరోనా గురించి చర్చించుకుంటే.. అందుకు భిన్నంగా తెలంగాణలో మాత్రం సీఎం కేసీఆర్ చుట్టూ తిరుగుతున్నాయి. ఒకపక్క అత్యవసర వైద్యానికి ఆసుపత్రుల్లో బెడ్లు లభించని వేళ.. ఆరోగ్య మంత్రిగా వ్యవహరించిన ఈటల రాజేందర్ (శనివారం ఆయన్ను ఆ శాఖ నుంచి తప్పించారు) పై భూకబ్జా ఆరోపణలు రావటం.. తదనంతరం చోటు చేసుకున్న పరిణామాలు సంచలనంగా మారాయి. ఈటల లాంటి సీనియర్ నేత మీద గులాబీ బాస్ గురి పెట్టిన వైనం చూస్తే.. ఆయనపై వేటు పక్కా అన్న మాట బలంగా వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో మంత్రి ఈటల కొందరు మిత్రులతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన నోటి నుంచి ఆసక్తికరవ్యాఖ్యలు రావటమే కాదు.. కేసీఆర్ మైండ్ సెట్ఎలా ఉంటుందన్న విషయాన్ని చెప్పటం గమనార్హం. ఇప్పటివరకు బయటకు రాని ఆయన తీరుపై.. ఆయనకు సుదీర్ఘకాలం సన్నిహితంగా వ్యవహరించిన ఈటల నోటి నుంచి ఈ తరహా వ్యాఖ్య రావటం విశేషం.
ఇంతకీ ఈటల ఏమన్నారంటే.. కేసీఆర్ తో ఒకసారి చెడితే మళ్లీ అతకదని.. అందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయన్నారు. ఇన్నారెడ్డితో మొదలు పెడితే నాయిని వరకు అలానే జరిగిందని.. కేసీఆర్ తో మళ్లీ అతుకుతుందని తాను అనుకోవటం లేదని.. 2018 ఎన్నికల నుంచి తనను వెంటాడుతున్నారన్నారు. తనకు తెలీకుండానే తన ఇంటిపై ఎన్నికల సమయంలో రైడ్ చేయించారన్నారు.
తన ప్రత్యర్థికి ఆర్థిక సాయాన్ని చేశారని.. ఒకసారి ఆర్డీవోతో భోజనం చేస్తే.. అదేదో జరిగినట్లుగా క్రియేట్ చేశారన్నారు. కొద్దిరోజులుగా కేటీఆర్ కొంతమంది పార్టీ నేతల ద్వారా తనకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నారన్నారు. మూడు రోజులుగా ఏదో జరిగిందని తనకు తెలిసిందని.. ఏమైనా ఉంటే తనను నేరుగా పిలిచి అడగాలే తప్పించి.. ఇలా చేయటం ఏమిటన్నారు.
కేటీఆర్ అందుబాటులోకి రాలేదని.. తనను కలిస్తే.. ఇదే విషయాన్ని సూటిగా అడుగుతానని చెప్పిన ఈటల.. మాట వినటం లేదన్న అక్కసుతోనే కుట్ర చేశారన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలోనే దేవరయాంజల్ లో తనకున్న ఆరు ఎకరాల భూమిని దేవాలయ భూముల కోటాలో నమోదు చేసినట్లు చెప్పారు. ఇప్పటివరకు దాన్ని క్లియర్ చేయలేదన్నారు.