Begin typing your search above and press return to search.
ఒకసారి కరోనా సోకితే మళ్లీ సోకట్లేదట!
By: Tupaki Desk | 18 Aug 2020 1:00 PM ISTఒకసారి కరోనా వైరస్ సోకి , కరోనా నుండి కోలుకుంటే , మళ్లీ రెండోసారి వారికి కరోనా సోకే అవకాశం లేదు. దీనిపై అమెరికాలో చిన్నపాటి పరిశోధన జరిగింది. దానిలో ఒక్క విషయం క్లారిటీగా చెప్పారు. ఒకసారి కరోనా వైరస్ సోకిన వాళ్లకు మళ్లీ కరోనా సోకట్లేదు. ఎందుకంటే, అలా సోకకుండా అడ్డుకునే స్థాయిలో వారిలో యాంటీ బాడీస్ ఉంటున్నాయి. దీన్ని గత నాలుగు నెలల కిందట చైనా కూడా చెప్పింది. అక్కడ కూడా రెండోసారి కరోనా సోకిన కేసుల్లేవు. దక్షిణ కొరియా కూడా ఇదే ఇలాగే చెప్పింది.
సీటీల్ నుంచి వెళ్లిన బోటు 18 రోజులు సముద్రంలో ప్రయాణించింది. అందులోని 122 మందిలో 104 మందికి కరోనా సోకింది. అందరికీ ఒకే వ్యక్తి నుంచి కరోనా సోకినట్లు తేలింది. ఆ బోటులో ఆల్రెడీ కరోనా నుంచి కోలుకున్నవారు తక్కువ మందే ఉన్నారనీ... అందువల్ల దీనిపై మరింత పెద్ద పరిశోధన చెయ్యాలని యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్, మెడిసిన్ క్లినికల్ వైరాలజీ లాబొరేటరీ అసిస్టెంట్ డైరెక్టర్ అలెగ్జాండర్ గ్రెనింజర్ అభిప్రాయపడ్డారు. ఆ వివరాలను మెడ్ ఆర్ జివ్ అనే ప్రిప్రింట్ సర్వర్ లో పోస్ట్ చేశారు.
ఈ పరిశోధన పెద్ద సంఖ్యలో చెయ్యడానికి ఓ కండీషన్ అడ్డు వస్తోంది. రికవరీ అయిన వారికి మళ్లీ కరోనా వైరస్ ని బలవంతంగా ఎక్కించడానికి కుదరదు. అది చాలా నేరం. అందువల్ల కరోనా నుంచి రికవరీ అయిన వారికి మళ్లీ కరోనా సోకుతుందా లేదా అనేది కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. అయితే , రెండోసారి కరోనా సోకుతున్న కేసులేవీ నమోదు రావట్లేదు. దీనితో ఈ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే , బోటులోని 104 మందికి కరోనా సోకిందంటే, దాని అర్థం వ్యాధి వ్యాప్తి 85.2 శాతం అన్నమాట. బోటు నడిపిన సిబ్బంది ముగ్గురికీ, ఆల్రెడీ బోటు ఎక్కక ముందే కరోనా వచ్చి తగ్గిపోయింది. వారి శరీరంలో యాంటీబాడీస్ ఉన్నాయి. 18 రోజుల ప్రయాణంలో ఆ ముగ్గురికీ ఎలాంటి లక్షణాలూ కనిపించలేదనీ పరిశోధకులు తెలిపారు. బోటులో మొత్తం 18 మందికి కరోనా రాలేదు. వారిలో ముగ్గురు ఆల్రెడీ వచ్చి తగ్గిన వారు. మిగతా 15 మంది క్లోజ్ కాంటాక్ట్ అవ్వకుండా దూరంగా ఉండి ఉంటారనీ, అందుకే వారికి సోకలేదని భావిస్తున్నారు. ఇప్పుడు ఈ రకమైన పరిశోధనల్ని 50 రోజులపాటూ చేస్తున్నారు. అయితే, రెండోసారి కరోనా సోకదులేని ఇష్టం వచ్చినట్టు బయట తిరగడం మంచిది కాదు.