Begin typing your search above and press return to search.

ఒక్క రోజులోనే ఒకటిన్నర లక్ష కేసులు...అయినా జనాల్లో భయమే లేదు

By:  Tupaki Desk   |   11 April 2021 6:30 AM GMT
ఒక్క రోజులోనే ఒకటిన్నర లక్ష కేసులు...అయినా జనాల్లో భయమే లేదు
X
దేశంలో కరోనా కేసులు వెల్లువలా పెరిగిపోతున్నాయి. అయినప్పటికీ జనాల్లో ఇసుమంత కూడా భయం కనిపించడం లేదు. చాలామంది మాస్కులు పెట్టుకోవడం లేదు. భౌతికదూరం అన్న సంగతే మర్చిపోయారు. కేవలం గత 24 గంటల్లోనే 1, 52, 879 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ నంబర్​ చూసినా జనం భయపడటం లేదు. వ్యాక్సిన్​ పై చాలా మంది అవగాహన పెంచుకోవడం లేదు. వ్యాపారాలు దెబ్బతింటాయి.. ప్రజలు నష్టపోతారు, ఉపాధి పోతుందన్న భయంతో ప్రభుత్వాలు కూడా కఠిన చర్యలు తీసుకోవడం లేదు. దీంతో బార్లు, పబ్బులు, క్లబ్బులు యథావిధిగా జరుగుతున్నాయి. ఇక ఫంక్షన్లు, వేడుకలు, ఉత్సవాలు, సభలు, సమావేశాలు కూడా జోరుగా సాగుతున్నాయి.

అయితే ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిందేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తప్పనిసరిగా మాస్క్​ ధరించాలని.. శానిటైజర్​ వెంట తీసుకొని వెళ్లాలని సూచిస్తున్నారు. అయితే ప్రజల్లో మాత్రం కరోనా భయం పోయింది. ప్రస్తుతం ఎవరూ భయపడటం లేదు. వ్యాక్సినేషన్​ కూడా తీసుకోవడం లేదు. కేసుల సంఖ్య, మృతుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో కొంతమంది ఇప్పుడిప్పుడే వ్యాక్సిన్​ పట్ల శ్రద్ధ చూపిస్తున్నారు.

దేశవ్యాప్తంగా గత 24 గంటల వ్యవధిలో 1,52,879 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఇదే రికార్డు.కరోనా సెకెండ్ వేవ్‌లో చుక్కలు చూపిస్తున్నది. అయితే గత 24 గంటల్లో 90,584 మంది కరోనా నుంచి కోలుకున్నట్టు సమాచారం. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,33,58,805కు చేరుకుంది. ఇందులో 1,20,81,443 మంది డిశ్చార్జ్ కాగా.. 1,69,275 మంది మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 11,08,087కు చేరింది. ఇప్పటిదాకా 10,15,95,147 మందికి వ్యాక్సిన్ వేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 25,66,26,850 శాంపిళ్లను పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వెల్లడించింది.

శనివారం ఒక్కరోజే 14,12,047 టెస్టింగులను చేపట్టినట్లు తెలిపింది. మహారాష్ట్రలో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. మరోవైపు ఇతర రాష్ట్రాలకు కూడా మహమ్మారి వేగంగా పాకుతున్నది. అయినప్పటికీ ఎన్నికల ప్రచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓ వైపు వ్యాక్సినేషన్​ కొనసాగుతున్నా.. కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది.