Begin typing your search above and press return to search.

ఆ ఊరిలో ఒక్కమగాడు ..ఎందుకంటే ?

By:  Tupaki Desk   |   5 Nov 2019 6:40 AM GMT
ఆ ఊరిలో ఒక్కమగాడు ..ఎందుకంటే ?
X
సాధారణంగా పల్లెటూరు అంటే పచ్చని చెట్లు , పచ్చని పైర్లు , చుట్టూ బంధువులు , ఊరి నిండా అయినవారు ..ఊరంతా మనవారే అనుకునే మనుషులు. అందుకే అందరూ పల్లెటూరు అంటే అంత ప్రాణమిస్తారు. కానీ , ప్రస్తుత రోజుల్లో సంపాదన కోసం పట్టణాలలో నివసిస్తున్నా కూడా ఏ పండుగ వచ్చిన ప్రతి ఒక్కరి మనసు పల్లెటూరి వైపే చూస్తుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. కానీ , ఆంధ్రప్రదేశ్ లోని ఒక గ్రామం మాత్రం నిర్మానుష్యంగా మారింది. పక్కనే మైలవరం డ్యామ్, కూతవేటు దూరంలో మండల కేంద్రం. మరికొద్ది దూరంలో నియోజకవర్గ కేంద్రమైన జమ్మలమడుగు .. సకల సౌకర్యాలు ఉన్నా కూడా ఆ ఊరి ఖాళీ అయిపోయింది. దీనికి ప్రధాన కారణం ..గతంలో అక్కడ జరిగిన ఒక హత్య.

ఆ హత్య తో నిత్యం నవ్వులతో , పిల్లల అట , పాటలతో కళకళలాడే ఆ ఊరు మొత్తం ఖాళీగా మారిపోయింది. గత నాలుగేళ్లుగా ఆ ఊరి అలాగే నిశబ్ధంగా ఉంది. అలాంటి ఆ ఊరిలో ఒక వృద్ధుడు మాత్రమే జీవనం కొనసాగిస్తున్నాడు. ఏడాది క్రితం వరకు ఆయనకి తోడుగా అయన భార్య ఉండేది. ఆమె కూడా కాలం చేయడంతో ఆ ఊరిలో ప్రస్తుతం అయన ఒక్కడే నివాసం ఉంటున్నాడు. ఆ ఊరి పేరు దప్పెర్ల .. జమ్మలమడుగు మండలం , పొన్నతోట పంచాయితీ.

వివరాలని చూస్తే .. గత కొన్ని రోజుల ముందు వరకు 40 ఇళ్ళు , 200 మందికి పైగా జనాభా , పచ్చని పైర్లతో దప్పెర్ల కళకళలాడేది. కానీ , 1991 లో పొలం తగాదా కారణంగా దేవ సహాయం అనే విశ్రాంత ఉపాద్యాయుడు హత్యకి గురైయ్యారు. ఇక ఆ నాటి నుండి ప్రతి రోజు విచారణ కోసం అని పోలీసులు రావడం మొదలుపెట్టారు. దీనితో ప్రతి రోజు వచ్చే పోలీసులకి సమాధానం చెప్పలేక ఒక్కొకరుగా ఆ గ్రామాన్ని వదిలి వెళ్లిపోవడం మొదలుపెట్టారు. దీనితో కొన్ని రోజుల్లోనే ఒక్క శేషం దానం కుటుంబం తప్ప ఊరు మొత్తం ఖాళీ అయిపోయింది. దీనితో ఆ ఊర్లో ఉన్న స్కూల్ ని కూడా మరోచోటికి మార్చడంతో దానం ముగ్గురు కుమారులు కూడా ..తమ పిల్లల స్కూల్ కోసం ఊరిని వదిలి వెళ్లారు. కానీ , ఆ వృద్ధ దంపతులు మాత్రం కన్నతల్లి లాంటి ఆ గ్రామాన్ని వదిలివెళ్లలేక పోయారు. గత ఏడాది డిసెంబర్ 19 న అయన భార్య కూడా మృతి చెందింది. దీనితో అప్పటినుండి ఒక్కడే జీవనం కొనసాగిస్తున్నాడు. ప్రతి నెలా పక్క ఊరిలోకి వెళ్లి రేషన్ తెచ్చుకొని , ప్రభుత్వం ఇచ్చే పింఛన్ డబ్బుతో బ్రతుకుతున్నాడు. ఎంతోమంది అయనని ఆ ఊరు వదిలి రావాలి అని చెప్పినా కూడా నేను ఇక్కడే పుట్టా ..నేను చచ్చే వరకు ఈ గ్రామాన్ని వదిలిపోను అని తెలిపినట్టు స్థానికులు చెప్తున్నారు.