Begin typing your search above and press return to search.
దేవుడా.. ఈ ప్రపంచం కన్నీరు పెడుతోంది!!
By: Tupaki Desk | 31 Oct 2022 1:30 PM GMTఔను! గత మూడు రోజుల్లో గమనిస్తే.. ఈ ప్రపంచానికి ఏమైంది దేవుడా! అనే మాటే వినిపిస్తోంది. ఆయా ఘటనల్లో ఒకరు కాదు ఇద్దరు కాదు.. సామూహికం గా ప్రాణాలు కోల్పోతున్నవారు వందల్లో ఉన్నారు. ఇలాంటివి తరచుగా చోటు చేసుకుంటున్నాయి. వీటిని గమనిస్తే.. ఒక్కొక్క సారి ఈ ప్రపంచానికి ఏమైంది? దేవుడా! అని ప్రజలు తలపట్టుకుంటున్నారు. గత మూడు రోజుల్లో భారత్ సహా ఈ ప్రపంచంలో జరిగిన ఘటనలను పరిశీలిస్తే.. ప్రతి ఘటనలలో 100 కు తక్కువ కాకుండా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇది అత్యంత విషాదకరమైన పరిస్థితే అయినా.. మరి ఎందుకు ఇలా జరుగుతోందో!!
భారత్: తాజాగా గుజరాత్‌లో ఘోర ప్రమాదం జరిగింది. మోర్బీ పట్టణంలో కేబుల్ బ్రిడ్జి కుప్పకూలిపోయింది. మచ్చూ నదిపై నిర్మించిన ఈ కేబుల్ బ్రిడ్జిపై నుంచి పెద్ద సంఖ్యలో సందర్శకులు నదిలో పడిపోయారు.
ఈ ఘటనలో ఇప్పటి వరకు 140 మంది మృతి చెందగా.. వందల సంఖ్యలో గాయపడ్డారు. వంతెన తెగిన సమయంలో దానిపై 500 మంది ఉండగా.. వీరిలో 100 మందికి పైగా నదిలో నీటిలో మునిగిపోయారు. ఇక్కడ మరో విషాదం ఏంటంటే బీజేపీకి చెందిన ఎంపీ కుటుంబంలోని వారు 12 మంది చనిపోయారు. ఇక, తల్లిదండ్రులతో వెళ్లిన ఓ చిన్నారి నీటమునిగి ప్రాణాలతో బయట పడగా.. ఆ తల్లిదండ్రులు మాత్రం మృత్యువు నోట చిక్కి పిల్నాణ్ని అనాథను చేశారు.
ఫిలిప్పీన్స్: ఇక్కడ నల్గే తుపాను బీభత్సం సృష్టించింది. తుపాను కారణంగా రాకాసి అలలు ఎగసిపడ్డాయి. వీటిని సునామీగా భావించి ఓ పర్వతంవైపునున్న చర్చి వద్దకు పరుగెత్తిన గ్రామస్థులు బురదలో సజీవ సమాధి అయ్యారు. దక్షిణ మాగ్విండనావో ప్రావిన్స్‌లోని కుసియోంగ్ గ్రామంలో జరిగిన ఈ ఘటనలో ఇప్పటి వరకు 120 మంది అక్కడికక్కడే చనిపోయారు.
దక్షిణ కొరియా: రాజధాని సియోల్‌లో శనివారం రాత్రి పెద్దఎత్తున ప్రజలు ఒక ఇరుకైన వీధి నుంచి వెళ్తుండగా.. ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 151మంది మృతిచెందగా... మరో150మందికిపైగా గాయాలపాలయ్యారు. గాయాలైన వారిలో ఎక్కువమంది గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 19 మంది విదేశీయులు ఉన్నారు.
సోమాలియా: సోమాలియా రాజధానిలో ఒక్కసారిగా రెండు చోట్ల.. భారీ బాంబు పేలుళ్లు సంభవించాయి. ఒకవైపు దేశాధ్యక్షుడు సహా ప్రధాని, ఇతర ఉన్నతాధికారులు దేశంలో హింసాత్మక తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంపై చర్చిస్తుండగా.. ఈ దాడులు జరిగాయి. ఈ ఘటనలో కనీసం 200 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆ దేశ అధ్యక్షుడు హసన్ షేక్ మహముద్ తెలిపారు.
కొసమెరుపు: ఇవన్నీ ఎప్పుడో జరిగినవి కావు.. శని, ఆదివారాల్లో చోటు చేసుకున్న దారుణ ఘటనలు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా సర్వమత ప్రార్థనలు జరుగుతున్నాయి. అటు పోప్ సైతం ప్రపంచ శాంతికి ప్రార్థనలు చేయాలంటూ.. ప్రకటించారు. మరోవైపు మక్కాలోనూ ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ సోమవారం ఉదయం ప్రార్థనలు చేశారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.