Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ ఒక్క ఛాన్స్‌.. బాబు లాస్ట్ ఛాన్స్‌..!

By:  Tupaki Desk   |   19 May 2021 2:30 PM GMT
జ‌గ‌న్ ఒక్క ఛాన్స్‌.. బాబు లాస్ట్ ఛాన్స్‌..!
X
ఏపీ సీఎం.. జ‌గ‌న్‌.. గ‌త 2019 ఎన్నిక‌ల‌స‌మ‌యంలో ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌చ్చిన‌ప్పుడు ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ.. నిన‌దించిన విష‌యం తెలిసిందే. జ‌గ‌న్ మాతృమూర్తి విజ‌య‌మ్మ కూడా ఇదే త‌ర‌హాలో ఏపీ ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. దీంతో ప్ర‌జ‌లు ఏమ‌నుకున్నారో.. ఏమో.. ఒక్క‌ఛాన్స్ జ‌గ‌న్‌కు ఇచ్చారు. అయితే.. ఆయ‌న అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ మాత్రం ఉనికి లేకుండా పోతోంది. ఎక్క‌డిక‌క్క‌డ నేత‌లపై కేసులు న‌మోదు కావ‌డం.. పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు చేసిన అవినీతివంటివి పార్టీ నేత‌ల‌కు ఇబ్బందిగా మారాయి. ఈ నేప‌థ్యంలో పార్టీ త‌ర‌ఫున వాయిస్ వినిపించేందుకు ఎవ‌రూ ముందుకు రాలేని ప‌రిస్థితి నెల‌కొంది.

ఇక‌, పార్టీని త‌న కుమారుడు లోకేష్ చేతుల్లో పెట్టి.. త‌ను రిటైర్ అవుదామ‌ని అనుకున్నా.. పార్టీలో లోకేష్‌ను గుర్తించేవారు కూడా క‌రువ‌య్యారు. దీంతో చంద్ర‌బాబు 70 ఏళ్ల వ‌య‌సు మీరినా.. తానే కాలికి బ‌లపం క‌ట్టుకుని ఇటీవ‌ల కార్పొరేష‌న్‌, స్థానిక ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేశారు. అదేవిధంగా తిరుపతి పార్ల‌మెంటు ఎన్నిక‌లోనూ చంద్ర‌బాబు వారం రోజుల పాటు ప్ర‌చారం నిర్వ‌హించారు. ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి అయినా. లోకేష్ పుంజుకుంటారులే.. అనుకున్నారు. ఈ క్ర‌మంలోనే బాడీ ప‌రంగా.. స్ట‌యిల్ ప‌రంగా లోకేష్‌లో అనేక మార్పులు తీసుకువ‌చ్చారు. అయిన‌ప్ప‌టికీ.. టీడీపీలో లోకేష్‌ను విశ్వ‌సించేవారు క‌రువ‌య్యారు.

ఇప్ప‌టికీ.. టీడీపీ అంటే.. చంద్రబాబు అనే అంటున్నారంటే.. లోకేష్ రేంజ్ ఎక్క‌డ‌కు ప‌డిపోయిందో అర్ధం అవుతూనే ఉంది. ఇటీవ‌ల లోకేష్ యువ నాయ‌కుల‌తో వ‌ర్చువ‌ల్ భేటీ నిర్వ‌హించారు. అయితే.. దీనికి ప‌ట్టుమ‌ని పాతిక మంది కూడా హాజ‌రు కాలేదు. అంటే.. అటు యువ‌తలోనూ లోకేష్‌కు ఫాలోయింగ్ లేద‌నేది స్ప‌ష్ట‌మైపోయింది. దీంతో ఇప్పుడు మ‌ళ్లీ చంద్ర‌బాబు తానే పార్టీ భుజాన వేసుకుని న‌డిపించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని గుర్తించారు. అయితే.. ఇప్పుడు నేత‌లు స్పందించ‌డం లేదు. మ‌రి ఏం చేయాలి? అనే దానికి ఆయ‌న చేస్తున్న ఏకైక ప్ర‌య‌త్నం.. చేస్తున్నార‌ట‌.

అది.. ఏంటంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇదే ఆఖ‌రు ఛాన్స్ త‌న‌ను గెలిపించాల‌ని ప్ర‌జ‌ల‌ను అభ్య‌ర్థించాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌. అంటే.. ఎలాగూ. త‌న వ‌య‌సు 70 ఏళ్లు మించిపోయింది క‌నుక‌.. ఈ ఒక్క లాస్ట్ చాన్స్ ఇవ్వాల‌ని.. అడ‌గ‌నున్నారు. అనంత‌రం.. ప్ర‌జ‌లు ఇచ్చే అవ‌కాశాన్ని బ‌ట్టి పార్టీని బ‌లోపేతంచేసి.. వ‌చ్చే 2029 ఎన్నిక‌ల నాటికి.. కుమారుడు లోకేష్ పుంజుకునేలా వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.