Begin typing your search above and press return to search.
ఒకే దేశం.. ఒకే వ్యాక్సిన్ పాలసీ ఎందుకు లేదు ప్రధాని?
By: Tupaki Desk | 21 April 2021 2:24 AM GMT‘‘ఒకే దేశం.. ఒకే మార్కెట్..’’ నినాదంతో తరచూ దేశ ప్రజల్ని ఏకం చేసేశానన్నట్లుగా వ్యవహరించే మోడీ.. ఒకే దేశం.. ఒకే పెట్రోల్ రేటు.. ఒకే దేశం.. ఒకే రీతిలో పన్ను బాదుడు లాంటి వాటిని కావాలని మర్చిపోయినట్లుగా కనిపిస్తారు. అంతేకాదు.. ఒకే దేశం.. ఒకేలాంటి నిధుల కేటాయింపు లాంటివి కూడా చేస్తే బాగుంటుంది. అందుకు భిన్నంగా వ్యవహరించే మోడీ.. తాజాగా టీకాల విషయంలో ఆయన వెల్లడించిన తాజా విధానం పలువురు తప్పుపట్టేలా ఉందని చెప్పక తప్పదు.
ఒకే దేశం.. ఒకే టీకా ఉండాలి కదా? ఇప్పటివరకు జరిగిన వ్యాక్సినేషన్ మొత్తం కేంద్రం కనుసన్నల్లో.. రాష్ట్రాలకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా వ్యవహరించిన మోడీ సర్కారు ఇప్పుడు మాత్రం.. రాష్ట్రాలకు.. ప్రైవేటు ఆసుపత్రులకు తలుపులు తెరిచేయటం.. పద్దెనిమిదేళ్లకు మించిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేసే విధానాన్ని ప్రకటించటం తెలిసిందే. ఒకే దేశం.. ఒకటే.. అంటూ తరచూ చెప్పే తన మానసపుత్రికను మోడీ మాష్టారు ఎందుకు వదిలేసినట్లు?
దేశ ప్రజలందరికి ఒకేలాంటి వ్యాక్సిన్ ప్రోగ్రాం ఉండాలి. ఒకవేళ.. తాజా విధానం సరైనదే అయితే.. ఇప్పటివరకు అనుసరించిన విధానం లోపం ఉందన్న విషయాన్ని ఒప్పుకోవాలి. దేశ ప్రజలందరికి ఒకే తరహాలో వ్యాక్సిన్ ఇవ్వకపోవటం ఏమిటి? ఇప్పటివరకు ఉచితంగా వ్యాక్సిన్ అందించటంతో పాటు.. రూ.250లకు వ్యాక్సిన్ వేస్తున్న వైనం తెలిసిందే. అందుకు భిన్నంగా ఒకే దేశం.. ఒకే ధర అంటూ వ్యాక్సినేషన్ ను ప్రకటించొచ్చు కదా?
నిజానికి ఇప్పుడు ప్రకటించిన విధానం ఏదైతే ఉందో.. అదే విధానాన్ని మొదటే ప్రకటించి ఉంటే.. ఈ రోజున దేశం ఎదుర్కొంటున్న సెకండ్ వేవ్ సమస్యే ఉండేది కాదు. వ్యాక్సిన్ విషయంలో మోడీ ప్రభుత్వం అనుసరించిన విధానం డిజాస్టర్ అన్న విమర్శ ప్రతి ఒక్కరి నోట వినిపిస్తోంది. నిజానికి.. రాష్ట్ర ప్రభుత్వాలకు.. ఫార్మా సంస్థలకు.. విదేశాల నుంచి వ్యాక్సిన్ కొనుగోలు చేసే వెసులు బాటు ఇచ్చి ఉంటే.. ఈ రోజున వ్యాక్సిన్ కోసం ఇంత కొరత ఉండేది కాదు. అంతేకాదు.. వ్యాక్సిన్ పెద్ద ఎత్తున అందుబాటులోకి వచ్చి ఉంటే.. ప్రజల్లో కరోనాను ఎదుర్కొనే శక్తి వచ్చి ఉండేది. అదే జరిగి ఉంటే.. ఇంత భారీగా కేసులు నమోదు అయ్యేవి కావు. ఒకవేళ.. కేసులు నమోదైనా.. తీవ్రత ఇంతలా ఉండేది కాదన్నది సత్యం.