Begin typing your search above and press return to search.
ఉత్తరాఖండ్ ఎపిసోడ్ క్రమం ఏమనగా...
By: Tupaki Desk | 23 April 2016 10:38 AM GMT24 గంటల వ్యవధిలో ఉత్తరాఖండ్ రాష్ట్రం మళ్లీ రాష్ట్రపతి పాలనలోకి వెళ్లిపోయింది. గురువారం నైనిటాల్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించడంతో కేంద్రానికి కాస్త ఊరట లభించింది. నిన్న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన హరీష్ రావత్ మళ్లీ ఇవాళ సాయంత్రం 5 గంటల తర్వాత తప్పుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక్కరోజు కూడా కాకుండా సీఎం పదవి కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిన ఉత్తరాఖండ్ రాష్ట్ర రాజకీయ ఎత్తుగడ - రాష్ట్రపతి పాలనలోని పది వాస్తవాలు...
1. కాంగ్రెస్ నేతృత్వంలోని ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి తగినంత బలం లేదని కేంద్రం పేర్కొంది. ముఖ్యమంత్రి హరీష్ రావత్ ఒక్క క్షణమైనా పదవిలో ఉండడానికి అనర్హుడని స్పష్టం చేసింది.
2. గత నెలలో రావత్ ప్రవేశపెట్టిన బడ్జెట్ కు వ్యతిరేకంగా 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓటేశారని, అసెంబ్లీలో ప్రభుత్వానికి బలం లేదనడానికి ఇంతకంటే నిదర్శనం అవసరం లేదని కేంద్రం అంటోంది.
3. వాస్తవానికి బడ్జెట్ ఆమోదం పొందలేదని, ఆదరా బాదరాగా అసెంబ్లీ ఆమోదం లభించినట్లు ప్రకటించారని కేంద్రం అంటోంది. మెజార్టీ ఎమ్మెల్యేలు బడ్జెట్ కు వ్యతిరేకంగా ఉన్నారని పేర్కొంటోంది.
4. బడ్జెట్ కు 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా ఓటేసినంత మాత్రాన హరీష్ రావత్ ప్రభుత్వాన్ని రద్దు చేయడం సబబు కాదని ఉత్తరాఖండ్ హైకోర్టు పేర్కొంది. తమ చర్యను సమర్థించుకోజాలరని స్పష్టం చేసింది.
5. గవర్నర్ ఆదేశం ప్రకారం గత నెలలో అసెంబ్లీలో రావత్ బల నిరూపణకు కేవలం ఒకరోజు ముందు ఉత్తరాఖండ్ లో కేంద్రం రాష్ట్రపతి పాలన విధించింది. కేంద్రం తీసుకున్న ఈ చర్యను ఉత్తరాఖండ్ న్యాయమూర్తులు తప్పుపట్టారు.
6. పార్టీ ఫిరాయించిన 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను స్పీకర్ అనర్హులుగా ప్రకటించారు. స్పీకర్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని, అనర్హత వేటు వెనక్కి తీసుకోవాలని సదరు ఎమ్మెల్యేలు కోరుతున్నారు.
7. సుప్రీంకోర్టు స్టే ఈనెల 27 వరకు అమలులో ఉంటుంది. అంటే అసెంబ్లీలో బల నిరూపణకు రెండు రోజుల ముందు వరకు అన్నమాట.
8. హరీష్ రావత్ ప్రభుత్వం అధికారంలో ఉండాలంటే ఉత్తరాఖండ్ అసెంబ్లీలోని మొత్తం శాసనసభ్యుల సంఖ్య లేదా ఆ రోజు హాజరైన వారిలో రెండింట మూడొంతుల ఓట్లు అవసరం.
9. అనర్హులైన వారిని మినహాయిస్తే హరీష్ రావత్ కు 31 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రస్తుతం అసెంబ్లీలోని బలాబలాలను బట్టి చూస్తే అదంత పెద్ద సమస్యేం కాదు. అదే ఎమ్మెల్యేలపై అనర్హత వర్తించకుంటే 36 మంది మద్దతు అవసరం అవుతుంది. అప్పుడు కష్టమవుతుంది.
10. అసెంబ్లీలో బల నిరూపించుకోవడం హరీష్ రావత్ కు అసాధ్యమంటున్నారు ఉత్తరాఖండ్ బీజేపీ నేతలు. ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు తాము ముందుకు వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇపుడు హరీశ్ రావత్ వేసే అడుగు ఉత్తరాఖండ్ భవిష్యత్ ను తేల్చనుంది.