Begin typing your search above and press return to search.
ఫారిన్ నుంచి వచ్చే ఒకడు.. రోజులో ఎంతమందిని కాంటాక్ట్
By: Tupaki Desk | 22 March 2020 12:30 AM GMTతెలంగాణలోని పలువురు అధికారుల్ని ఒక ప్రశ్న ఇప్పుడు విపరీతంగా వేధిస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తిలో కీలకం.. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు. దేశం కాని దేశం నుంచి కరోనా వైరస్ ను మోసుకొచ్చే అవకాశం విదేశీ ప్రయాణికుల కారణంగానే ఉంటుందన్నది మర్చిపోకూడదు. విదేశాల నుంచి వచ్చిన వారు.. మరీ ముఖ్యంగా మార్చి ఒకటో తేదీ నుంచి వచ్చిన వారి విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
డిసెంబరు చివరి వారంలో కరోనా వైరస్ చైనాలో వెలుగు చూసినా.. ఇతర దేశాలకు వ్యాప్తి చెందటానికి దాదాపు మూడు నెలల సమయం పట్టిందన్నది మర్చిపోకూడదు. చైనా నుంచి వివిధ దేశాలకు చేరిన ప్రయాణికుల విషయంలో ఆయా దేశాలు సరైన అప్రమత్తతో వ్యవహరించకుండా చేసిన పనికి ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా రెండు లక్షలకు పైనే కరోనా పాజిటివ్ అయ్యారన్నది మర్చిపోకూడదు.
ఇప్పుడు అలాంటి ప్రమాదమే.. రెండు తెలుగు రాష్ట్రాలకు పొంచి ఉందని చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు వచ్చే విదేశీ ప్రయాణికుల్లో సింహభాగం హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టు కాగా.. కొద్దిమంది మాత్రం దేశ రాజధాని ఢిల్లీ.. ఆర్థిక రాజధాని ముంబయిలలో దిగి.. అక్కడి నుంచి రైల్లో కానీ.. డొమెస్టిక్ ఫ్లైట్లలో వారి వారి స్వస్థలాలకు చేరుకుంటూ ఉంటారు.
కరోనా వైరస్ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు రోజులో ఎంతమందిని కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉందన్నదిప్పుడు ఇప్పుడు ప్రశ్నగా మారింది. కొందరు అధికారుల అంచనాల ప్రకారం.. మిగిలిన వారితో పోలిస్తే.. ఫారిన్ టూర్ నుంచి వచ్చినోళ్లు ఎక్కువమందిని కాంటాక్ట్ అవుతారని చెబుతున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిని పలుకరించేందుకు కుటుంబ సభ్యులు మొదలు.. బంధుగణం.. స్నేహితులు.. తెలిసిన వారు.. దగ్గరవారు.. స్నేహితుల స్నేహితులు ఇలా చాలా కాంబినేషన్లలో కలుస్తారని విశ్లేషిస్తున్నారు.
ఇలా కలిసే నేపథ్యంలో తక్కువలో తక్కువ రోజులో పాతిక మంది నుంచి యాభై వరకూ.. కొందరి విషయంలో వంద మంది వరకూ ఉంటారని చెబుతున్నారు. అంటే.. ఒక విదేశీ ప్రయాణం చేసినోళ్లు ఎలాంటి ముందస్తు జాగ్రత్తల్ని తీసుకోకుండా.. తమకు ఆరోగ్యం బాగానే ఉందన్న కారణంతో కలుసుకోవటం షురూ చేస్తే.. ఆ సంఖ్య భారీగానే ఉంటుంది. విదేశీ ప్రయాణాలు చేసి వచ్చిన వారిని కలిసినోళ్లు.. మళ్లీ ఇతరుల్ని కలవటాన్ని పరిగణలోకి తీసుకుంటే.. లెక్క తేల్చటం కష్టమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.