Begin typing your search above and press return to search.
స్టేట్ టాపర్..సివిల్స్ లో ఫెయిల్యూర్..ఆమె పేరుతో విషం
By: Tupaki Desk | 5 Oct 2019 5:20 AM GMTటెన్త్ లో మంచి మార్కులు. ఇంటర్ లో ఏకంగా స్టేట్ టాపర్. ఇంజనీరింగ్ లోనూ తిరుగులేని అతగాడు సివిల్స్ గురి పెట్టాడు. రెండో ప్రయత్నంలో ఇంటర్వ్యూ వరకూ వెళ్లాడు. కానీ.. సక్సెస్ కాలేకపోయాడు. మరో ప్రయత్నం చేయాలన్న పట్టుదల.. తనకున్న తెలివితో మరింత సక్సెస్ ఫుల్ కావాలనుకోవాల్సింది పోయి.. వక్ర మార్గంలో ప్రయాణించిన అతగాడు ఇప్పుడు ఉచలు లెక్కిస్తున్నాడు.
విన్నంతనే గగుర్పాటుకు గురి చేసే ఈ ఉదంతంలోకి వెళితే.. కృష్ణా జిల్లా పెద ఓగిరాలకు చెందిన కూనపరెడ్డి మన్మోహన్ చదువులో ముందుంటాడు. ఐదేళ్ల క్రితం ఇంజనీరింగ్ పూర్తి చేసిన అతడు తన తదుపరి లక్ష్యంగా సివిల్స్ పెట్టుకున్నాడు. రెండోప్రయత్నంలో గత ఏడాది ఇంటర్వ్యూ వరకూ వెళ్లినా ఫలితం దక్కలేదు. దీంతో.. డిప్రెషన్ కు లోనైన అతడిలో పైశాచికత్వం నిద్ర లేచింది.
ఏపీ.. తెలంగాణ.. కర్ణాటక.. మహారాష్ట్ర.. పంజాబ్.. మధ్యప్రదేశ్.. రాజస్థాన్ రాష్ట్రాల్లో విధులు నిర్వహిస్తున్న 54 మంది మహిళా ఐఏఎస్.. ఐపీఎస్ అధికారుల పేర్లతో ఫేస్ బుక్ దొంగఖాతాల్ని క్రియేట్ చేయటం.. అందులో ఇష్టారాజ్యంగా రాతలు రాసేవాడు. తమ పేరుతో ఇష్టం వచ్చినట్లుగా ఉంటున్న వైనం చూసిన హైదరాబాద్ కు చెందిన మహిళా ఐపీఎస్ అధికారిణి ఫేస్ బుక్ కు కంప్లైంట్ ఇచ్చి ఇప్పటికి నాలుగుసార్లు తొలగించారు.
అయినప్పటికీ నకిలీ ఖాతాను తెరుస్తున్న వైనంతో పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. తన పేరుతో ఫేస్ బుక్ ఖాతా తెరవటమే కాదు.. అందులో అసభ్య పోస్టులు చేస్తూ.. మహిళా అధికారులకు తలనొప్పిగా తయారయ్యాడు. ఈ నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు మన్మోహన్ ను అదుపులోకి తీసుకున్నారు. అతడి కారణంగా 54 మంది మహిళా ఐఏఎస్.. ఐపీఎస్ అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నట్లు గుర్తించారు. అతడ్ని విచారిస్తున్నారు. తాజా ఉదంతంతో మహిళా ఐఏఎస్.. ఐపీఎస్ అధికారుల పేరుతో ఎవరైనా ఫేస్ బుక్ ఖాతాను క్రియేట్ చేయాలని చూస్తే.. అలాంటివాటిని ఆమోదించొద్దని.. తమకు సమాచారం ఇవ్వాల్సిందిగా పోలీసులు ఫేస్ బుక్ ప్రతినిధులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. తెలివి ఎంత ఉంటే మాత్రం.. బుద్ది దారి తప్పితే ఎలా ఉంటుందనటానికి మన్మోహన్ ఉదంతం నిలువెత్తు నిదర్శనంగా చెప్పక తప్పదు.