Begin typing your search above and press return to search.

హియర్ ఫోన్స్ వాడకంతో వంద కోట్ల మందికి వినికిడి లోపం..!

By:  Tupaki Desk   |   17 Nov 2022 2:30 AM GMT
హియర్ ఫోన్స్ వాడకంతో వంద కోట్ల మందికి వినికిడి లోపం..!
X
అతి అనర్థదాయకమని మన పెద్దలు ఎప్పుడు చెబుతూనే ఉంటారు. ఈ నానుడి టెక్నాలజీ విషయంలో మరోసారి రుజువవుతుంది. సాంకేతికత పెరుగుతున్న కొద్ది గతంలో లేని కొత్త కొత్త జబ్బులన్నీ తెరపైకి వస్తుండటం ఆందోళనను రేకెత్తిస్తోంది. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్ల మంది వినికిడి సమస్యతో బాధపడే అవకాశం ఉందని వెల్లడైంది. బీఎంజే గ్లోబల్ హెల్త్ జర్నల్ ఈ విషయాన్ని ధృవీకరిస్తూ ఒక కథనాన్ని ప్రచురించింది.

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 43 కోట్ల మంది వినికిడి సమస్యతో బాధ పడుతున్నారని ఒక అంచనా ఉంది. అయితే ఇటీవలీ కాలంలో హియర్ ఫోన్స్.. ఇయర్ బర్డ్స్ వినియోగం భారీగా పెరిగింది. వీటి ద్వారా భారీగా శబ్దాలను వినడం ద్వారా యుక్త వయస్సు కలిగిన పిల్లలు.. యువతలో వినిడి సమస్య వచ్చే ప్రమాదం ఉందని బీజేఎం హెల్త్ తన అధ్యయనంలో పేర్కొంది.

సాధారణంగా పెద్దవారిలో 80 డెసిబెల్స్.. పిల్లలో 75 డెసిబెల్స్ స్థాయి వరకు శబ్దాలను వినొచ్చు. అంతకంటే ఎక్కువ స్థాయి శబ్దాలను విన్నట్లయితే వినికిడి సమస్య వచ్చే అవకాశం అధికంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం వినియోగిస్తున్న హెడ్ ఫోన్స్.. ఇయర్ బడ్స్ వంటి పరికరాల వల్ల 105 డెసిబెల్ వరకు శబ్దాలను వింటున్నారని అమెరికాలోని మెడికల్ యూనివర్సిటీ ఆఫ్ సౌత్ కరోలినా చేపట్టిన అధ్యయనంలో వెల్లడైంది.

ఇటీవలి కాలంలో పెరిగిన స్మార్ట్ ఫోన్ల వినియోగంతో ప్రతి ఒక్కరూ హియర్ ఫోన్స్.. ఇయర్స్ బ్లడ్ ను వాడుతున్నారు. వీటిలో ఎక్కువ శబ్ధాలతో మ్యూజిక్ వింటూ ఆనందిస్తున్నారు. అంతేకాకుండా పెద్దపెద్ద శబ్ధాలుండే మ్యూజిక్ పార్టీలకు యువత ఎక్కువగా హాజరవుతున్నారు. దీని వల్ల యువతకు వినికిడి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పౌరులు తమ ఆరోగ్యం దృష్ట్యా సురక్షితమైన వినికిడి పరికరాలు వినియోగించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ దిశగా ప్రభుత్వాలు సైతం దృష్టిసారించాలని పలువురు కోరుతున్నారు. వీలైనంత వరకు హెడ్ ఫోన్స్.. ఇయర్స్ బ్లడ్ వినియోగాన్ని తగ్గించుకున్నట్లయితే ఈ సమస్య నుంచి తప్పించుకునే అవకాశముంది. ఏ వస్తువైనా అవసరానికి మించి వాడకపోవడమే మంచిదని ఈ తాజా అధ్యయనం మరోసారి రుజువు చేసింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.